Reading Time: 2 minutes
దుమ్మురేపుతున్న ప్యారడైజ్.. రెండో రోజే రూ.114 కోట్లకు పైగా.. వీకెండ్‌లో మరిన్ని రికార్డులు.?

నేచురల్ స్టార్ నాని నటించిన  లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. నాని కెరీర్‌లో అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న చిత్రంగా ‘ది ప్యారడైజ్’ నిలిచినట్లు చిత్రబృందం పేర్కొంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో పాటు థియేటర్లలో ఆక్యుపెన్సీ కూడా ఆశాజనకంగా ఉండటంతో రానున్న రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

తెలుగు రాష్ట్రాల్లో ‘ది ప్యారడైజ్’కు మంచి ఆదరణ లభిస్తోంది. నాని మార్కెట్‌కు అనుగుణంగా ఇప్పటికే భారీ ఓపెనింగ్స్‌ను అందుకున్న ఈ చిత్రం రెండో రోజు కూడా కలెక్షన్లలో దూసుకుపోతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్‌గా మారినట్లు తెలుస్తోంది. ఇది కేవలం తెలుగు మార్కెట్‌కే పరిమితం కాకుండా తమిళనాడు, కర్ణాటకతో పాటు హిందీ మార్కెట్‌లోనూ ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. నాని చిత్రాలకు ఉన్న మార్కెట్‌తో పాటు శ్రీకాంత్ ఓదెల గత చిత్రం తర్వాత ఏర్పడిన అంచనాలు కూడా ది ప్యారడైజ్ కు కలిసొస్తున్నాయి.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

ఇక ఓవర్సీస్ లోనూ ది ప్యారడైజ్ మంచి వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో సినిమా దూకుడు కొనసాగుతోంది ఈ సినిమా. అక్కడ ఇప్పటికే 1.7 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా అందుకునే దిశగా సినిమా దూసుకుపోతుందని తెలుస్తోంది. రెండు రోజుల్లోనే రూ.114 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ది ప్యారడైజ్ ప్రస్తుతం మూడో రోజులోకి అడుగుపెట్టింది. వీకెండ్ కావడంతో థియేటర్లలో బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన కనిపిస్తుండటంతో ఈ వారాంతంలో సినిమా కలెక్షన్లు మరింత పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.