
ఐఐటీ ముంబైలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమ బిడ్డను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ను కలిసిన స్టూడెంట్ పేరెంట్స్.. తమ కుమారుడి మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని వినతిపత్రం ఇచ్చారు.
తమ కుమారుడి మృతికి కారణమైన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా, ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ శిరీష్ కేదారేలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ముంబై ఐఐటి బయట తమ నిరసన దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిరాహార దీక్షకు ముందు కొందరు వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.IIT బాంబేలోని క్యాంపస్ బయట నిరాహార దీక్షనుదీక్షకు కొన్ని గంటల ముందు అంటే బుధవారం తెల్లవారు జామున బలవంతంగా కారులో ఎక్కించుకొని ముంబై నుంచి 555 కిలోమీటర్ల దూరం లో ఉన్న వాషిమ్ జిల్లాకు తరలించారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించారు. తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారని డ్రైవర్‌ను పదే పదే అడిగామని,ఇంటికి వెళ్తున్నామని డ్రైవర్ అబద్దం చెప్పారని ఆ సమయంలో అలసిపోయి, నిద్రమత్తులో ఉన్నామని చనిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారు.
తమ కుమారుడి మృతికి కారణమైన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా, ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ శిరీష్ కేదారేలను తక్షణమే అరెస్టు చేయాలని, తమకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పారు.