Reading Time: < 1 minute

పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తాం: ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

Caption of Image.

వైరా/ కొణిజర్ల, వెలుగు: వైరా మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త సేకరణ కోసం రూ.50 లక్షలతో కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలను ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. అనంతరం కొణిజర్ల మండలం లింగగూడెం, వేతంకుంట గ్రామాల్లో కొనసాగుతున్న భూ సర్వేను సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌‌‌‌‌‌‌‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. రైతులు, భూ యజమానులు సర్వే అధికారులకు సహకరించాలని కోరారు. పెద్దగోపతి విద్యుత్ సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ఎమ్మెల్యే, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తో కలిసి సందర్శించారు.

సుమారు ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలంలో రూ.4 కోట్లతో 800 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గ్రామంలో విద్యుత్ స్తంభాలు, మరమ్మతు పనులను పరిశీలించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను
 ఆదేశించారు. 

©️ VIL Media Pvt Ltd.