
చెన్నైలో ఒక యువకుడిని బ్లాక్‌మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై తమిళ్ బిగ్ బాస్ ఫేం వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని గిండి ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడిని షార్ట్ ఫిల్మ్ తీయడానికి డబ్బు పెట్టుబడిగా పెట్టమని వర్షిణి కోరింది.
ఆమె ఆ యువకుడిపై ఒత్తిడి తెచ్చి.. అతని దగ్గర నుంచి రూ. 5 లక్షల దాకా వసూలు చేసింది. అంతేకాదు.. మరో రూ.27 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తన దగ్గర డబ్బులు లేవని.. తాను ఇచ్చిన రూ.5 లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు సదరు యువకుడిపై ఆమె, ఆమె అనుచరులు దాడి చేశారు.
పిలిచి దాడి చేసి, అతని దగ్గర ఉన్న 2 సెల్ ఫోన్లు, రూ. 50 వేల డబ్బు లాక్కుందని బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత యువకుడు ఈ విషయమై గిండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. యువకుడు ఇచ్చిన ఆధారాల ప్రకారం పోలీసులు కేసును దర్యాప్తు చేసి, నటి వర్షిణి వెంకట్‌తో సహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
వర్షిణి వెంకట్ బిగ్ బాస్ తమిళ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. సినిమాల్లో కూడా నటించింది. ‘XY’, ‘లారా’, ‘సొట్ట సొట్ట నానైయుదు’ సినిమాల్లో నటించింది. వర్షిణి కేవలం నటి మాత్రమే కాదు. గాయని, గీత రచయిత్రి కూడా. ఆమె తన జిమ్ వర్కౌట్, ఫిట్‌నెస్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పాపులర్ అయింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.