
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదంపై ప్రశ్నించిన సమయంలో అతను ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 81వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా యూఎన్ ప్రధాన కార్యాలయంలోకి షెహ్‌బాజ్ షరీఫ్ ప్రవేశిస్తున్న సమయంలో, ‘‘ప్రధాని గారూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు ఆపుతారు’’ అని మీడియా ప్రశ్నించింది. దీనికి షెహబాజ్ షరీఫ్ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.
ఇదే కాకుండా ‘‘లష్కరే తోయిబా (LeT) చీఫ్ హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’ అని ప్రశ్నించగా, షరీఫ్ మళ్లీ మౌనంగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. భారత్‌లో అనేక ఉగ్రదాడులకు కీలక సూత్రధారిగా ఉన్న హఫీజ్ సయీద్‌ను ఐక్యరాజ్యసమొతి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో ఉంచింది. 2008లో సయీద్‌ను అల్‌ఖైదా సంబంధిత ఆంక్షల జాబితాలో చేర్చారు. పాకిస్తాన్ ప్రభుత్వ కస్టడీలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. అయితే, పాక్ జైలులో ఉన్నాడని చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ ఆ దేశంలో సురక్షితంగా తిరుగుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. 2008 ముంబై ఉగ్రదాడితో సహా అనేక ఉగ్రవాద దాడుల్లో హఫీజ్ సయీద్ కీలకంగా ఉన్నాడు.
#WATCH | New York, US: “Prime Minister, when will you stop harbouring terrorists?” ANI questions Pakistani Prime Minister Shehbaz Sharif as he enters the UN headquarters. Pakistani PM refuses to answer. pic.twitter.com/IMANrxWYb5
— ANI (@ANI) September 24, 2026