Reading Time: < 1 minute

టాటా మోటార్స్ కొత్త కాంపాక్ట్ సెడాన్ ‘ఏరిస్’.. రూ.5లక్షల 29వేల ప్రారంభ ధరతో

Caption of Image.

మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు పోటీగా టాటా మోటార్స్ కొత్తగా ‘ఏరిస్’ కాంపాక్ట్ సెడాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. గతంలో ఉన్న టాటా టిగోర్ స్థానంలో ఈ మోడల్ ప్రవేశపెట్టబడింది. పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 5లక్షల 29వేలు కాగా, సీఎన్జీ వేరియంట్ ధర రూ.6లక్షల 29వేల నుండి ప్రారంభమవుతుంది.

ఈ కారును పూర్తిగా వ్యక్తిగత అవసరాల కోసం వాడే కస్టమర్లను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా రూపొందించినట్లు టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ఫ్లీట్ ఆపరేషన్స్ లేదా క్యాబ్ సర్వీసుల కోసం దీనిని ఉపయోగించరు. వాణిజ్య అవసరాల కోసం టాటా ‘ఎక్స్ప్రెస్-టి’ బ్రాండ్‌ను కొనసాగిస్తుంది.

ఇది 1.2-లీటర్ ఇంజిన్‌తో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 419 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇది ప్రత్యర్థుల కంటే ఎక్కువ. ఇక సీఎన్జీ మోడల్‌లో 227 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

స్మార్ట్, ప్యూర్, ప్యూర్+, క్రియేటివ్, అకంప్లిష్డ్ అనే 5 ట్రిమ్‌లలో లభించే ఈ కారులో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, డాష్‌క్యామ్ ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా ఇచ్చారు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. అక్టోబర్ 11 నుంచి డెలివరీలు స్టార్ట్ అవుతాయని టాటా మోటార్స్ ప్రకటించింది.

©️ VIL Media Pvt Ltd.