Reading Time: < 1 minute

బెల్లంపల్లి: ఆన్‌‌‌‌లైన్ బెట్టింగ్స్‌‌‌‌కు అలవాటు పడి..అప్పుల పాలై వ్యక్తి సూసైడ్

Caption of Image.

బెల్లంపల్లి, వెలుగు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగులకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తాళ్లగురిజాల ఎస్ఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చిన్నబూదా గ్రామానికి చెందిన చీకటి రాజేశం(41) తాపీ మేస్త్రీ. ఆన్‌‌‌‌లైన బెట్టింగులు, గేమ్స్‌‌‌‌కు అలవాటు పడిన రాజేశం డబ్బులు పోగొట్టుకున్నాడు. 

ఈక్రమంలో అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చే మార్గం లేక మంగళవారం రాత్రి చెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌‌‌‌ఐ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.