Reading Time: < 1 minute

ఎన్నికల కమిషన్ ది నియంతృత్వం .. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సంస్థే ఇలా చేయడమేంటి?: కేటీఆర్ 

Caption of Image.

 

  • ముగ్గురిలో ఇద్దరు కమిషనర్లునిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎలా అమలు చేస్తరు
  • మెజారిటీ అనే పదానికి డెఫినేషన్​ మారుస్తున్నారని ఆగ్రహం

హైదరాబాద్​, వెలుగు: ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం తీరు నియంతృత్వ ధోరణిలోకి వెళ్తున్నదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఎన్నికల సంఘం పనితీరును సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో పోస్ట్ పెట్టారు. ముగ్గురిలో ఇద్దరు ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది మెజారిటీ కాదా? అని ప్రశ్నించారు.

ఓటర్ల నమోదు, ఓట్ల తొలగింపు, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చడం వంటి అంశాల్లో సందేహాలకు తావిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే ఎలా అన్నారు.  ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ఉన్న సంస్థ పునాదులే బలహీనపడుతున్న పరిస్థితిలో దాని నిర్ణయాలను వదిలేయలేమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు, రాజ్యాంగ సంస్థలు, పౌర సంఘాలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు కలిసి ముందుకు రావాలన్నారు. తెలంగాణలో అత్యధిక ఓట్ల తొలగింపులు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన స్థానాల్లోనే ఉన్నాయి.

దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ, సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి చెంపపెట్టు అన్నారు. అనర్హత నుంచి తప్పించుకునేందుకు దానం నాగేందర్ చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని, హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సమర్థిస్తూ స్పష్టమైన నిర్ణయం వెలువరించిందని పేర్కొన్నారు. స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఫిరాయింపుదారులను కాపాడుకోవచ్చని వారు భావించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ఖైరతాబాద్​ ప్రజలు త్వరలోనే తమ తీర్పును ఇస్తారని చెప్పారు. దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనర్హతతో ఒక వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిందని, ఇక ముందు మరిన్ని వికెట్లు పడతాయన్నారు.  

©️ VIL Media Pvt Ltd.