
డిస్రిబ్యూషన్ రంగంలో నుండి ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్‌లోకి అడుగుపెట్టిన కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు బొత్తిగా టైం బాగోలేదు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి చేతులు కాల్చుకుంటోంది. ఏ ఇండస్ట్రీకి వెళ్లిన ఇదే సిచ్యుయేషన్ రిపీట్ అవుతోంది. తాజాగా మరొక ఝలక్ తగిలింది. తక్కువ టైంలోనే స్టార్స్‌తో బడా చిత్రాలు నిర్మించి పాపులరైన కెవిఎన్ ప్రొడక్షన్స్ కాసుల్ని కూడగట్టుకోవడంలో మాత్రం తడబడుతోంది. ఈ నిర్మాణ సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఈ ఏడాది వచ్చిన సినిమాలే అందుకు నిదర్శనం. ఓన్ రిస్క్ చేసుకున్న సినిమాలే కాదు.. కో ప్రొడ్యూస్ చేసిన చిత్రాలదీ అదే దారి.
కెవిఎన్ నుండి ఈ ఏడాది అరడజన్ సినిమాలొచ్చాయి. అందులో స్మాల్, మీడియం, లార్జ్ బడ్జెట్ చిత్రాలున్నాయి. తెలుగు మినహా మిగిలిన ఇండస్ట్రీల్లో మూవీస్ తీసి చేతులు కాల్చుకుంది ప్రొడక్షన్ హౌస్. కల్ట్, కెడీ ద డెవిల్ రిజల్ట్స్ పక్కన పెడితే.. భారీ బడ్జెట్ ఫిల్మ్స్ జననాయగన్ అండ్ టాక్సిక్ చిత్రాలు సంస్థకు హ్యూజ్ లాస్ తెచ్చిపెట్టాయి. ఇక తాజాగా వచ్చిన బాలీవుడ్ ఫిల్మ్ హైవాన్ కూడా బాక్సాఫీస్ బాంబ్‌గా మారింది. భారీ నష్టాలు చవిచూస్తున్నా కెవిఎన్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ఆపడం లేదు. టాలీవుడ్ అండ్ కన్నడ సూపర్ స్టార్స్‌తో సినిమాలు నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో కాకా, శివరాజ్ కుమార్‌తో బెయిల్ మూవీని తీస్తోంది. కాకా రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది. కానీ బెయిల్ అక్టోబర్ 2న విడుదలౌతోంది. దీక్షిత్ శెట్టి కీ రోల్ ప్లే చేస్తున్నాడు. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై ఇంట్రస్ట్ కలిగిస్తోంది. మరి శివరాజ్ కుమార్ కెవిఎన్ సంస్థను ఈ ఫ్లాప్స్ నుండి గట్టెక్కిస్తాడో లేదో లెట్స్ సీ.