
చాన్నాళ్ల తర్వాత థియేటర్కు వెళుతున్నానని.. నాని, శ్రీకాంత్ ఓదెల ‘ప్యారడైజ్’ సినిమా చూసేందుకు శనివారం రాత్రి థియేటర్కు వెళుతున్నానని కేటీఆర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఈ సినిమాను బీఆర్ఎస్ శ్రేణులు ఆదరిస్తున్నాయనేది కాదనలేని సత్యం.
After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”
— KTR (@KTRBRS) September 26, 2026
కేసీఆర్ను పోలిన పాత్రను సినిమాలో చూపించడం.. కేసీఆర్ స్టైల్ ఆఫ్ టాకింగ్, స్వాగ్ సినిమాలో చూపించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ‘ది ప్యారడైజ్’ సినిమా చూసి సంబరపడిపోతున్నారు. కేటీఆర్ ఈ సినిమాకు వెళ్లాలని భావించడానికి కూడా ఇదే కారణం అయి ఉండొచ్చని టాక్. ఇప్పటికే ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో క్లిప్స్, కేసీఆర్ను పోలి ఉన్న ప్రియదర్శి గెటప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే కిక్ వేరు కావడంతో కేటీఆర్ ‘ది ప్యారడైజ్’ సినిమాకు వెళ్లాలని నిర్ణయించారు. శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో విడుదలైన రెండో సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ తగ్గలేదు. శనివారం మధ్యాహ్నం 1.10 సమయానికి.. గడచిన గంటలో 14 వేలకు పైగా టికెట్లు బుక్ అయినట్లు బుక్ మై షో ప్రకటించింది.
ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 114 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. ‘ది ప్యారడైజ్’ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మాత. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు, కయాదు లోహర్, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.