Reading Time: < 1 minute
Zeno 300 Price Specs Features Launch

జెనో సంస్థ తన కొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ అయిన ‘జెనో 300’ను రూ. 10,000 లోపు బడ్జెట్ సెగ్మెంట్‌లో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్, పటిష్టమైన నిర్మాణం, రోజువారీ అవసరాలకు సరిపడే పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీని ధర రూ. 9,649గా ఉండగా.. ఇది లావెండర్ పర్పుల్, సిల్వర్ మిస్ట్ , క్లాసిక్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అయిన అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ యునిసోక్ T7100 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 4GB ఫిజికల్ ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అదనంగా 8GB వర్చువల్ ర్యామ్ విస్తరణకు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మొత్తం 12GB వరకు ఎఫెక్టివ్ ర్యామ్ లభిస్తుంది. ఇది మెసేజింగ్, డిజిటల్ పేమెంట్లు , మీడియా స్ట్రీమింగ్ వంటి ప్రాథమిక యాప్‌లను సజావుగా రన్ చేయడానికి సహాయపడుతుంది. ఈ ఫోన్ తేలికపాటి ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్‌పై పనిచేస్తుంది. ఇది ఎంట్రీ-లెవల్ హార్డ్‌వేర్‌పై మెమరీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది.

ముందు భాగంలో 90Hz రిఫ్రెష్ రేట్, 720×1612 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన 6.56 అంగుళాల HD+ డిస్ప్లేను అందించారు. సెల్ఫీల కోసం వాటర్‌డ్రాప్ నాచ్‌లో 5MP ఫ్రంట్ కెమెరాను, వెనుక వైపు 8MP ప్రైమరీ కెమెరాను పొందుపరిచారు. ఆడియో అనుభూతి కోసం DTS సౌండ్ ప్రాసెసింగ్, 3.5 మిమీ ఆడియో జాక్ ఉన్నాయి. ఈ ఫోన్ ప్రధాన హైలైట్ దీని బ్యాటరీ. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన భారీ 6,000mAh బ్యాటరీతో వస్తుంది.

అంతేకాకుండా కొనుగోలు చేసిన తేదీ నుంచి 100 రోజుల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ పాలసీని బ్రాండ్ అందిస్తోంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-సి , IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐటెల్ ఇండియా సీఈఓ అరిజిత్ తలపాత్ర మాట్లాడుతూ.. వినియోగదారుల రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని అత్యుత్తమ ఫీచర్లతో సరసమైన ధరకు తీసుకువచ్చినట్లు తెలిపారు.