
హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. రూ.39 లక్షలకు బాలాపూర్ లడ్డూను సామ ప్రణీత్ రెడ్డి దక్కించుకున్నారు. వనస్థలిపురం సాహెబ్ నగర్కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేతనే ఈ సామ ప్రణీత్ రెడ్డి. గత ఏడాది కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే భక్తుడు అత్యధికంగా రూ.35 లక్షలకు 21 కిలోల లడ్డూను కైవసం చేసుకున్నారు.
2024లో రూ. 30,01,000 కి కొలను శంకర్ రెడ్డి, 2023లో రూ. 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి, 2022లో రూ. 24,60,000కు కె. లక్ష్మారెడ్డి, 2021లో రూ. 18,90,000 కు రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డి గెల్చుకున్నారు. 2020లో కరోనా కారణంగా వేలం వేయలేదు.
ఈసారి వేలంలో 8 మంది పాల్గొన్నారు. ఇందులో వనస్థలిపురం సాహెబ్ నగర్ కు చెందిన అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి, చంపాపేట కు చెందిన మర్రి రవికిరణ్ రెడ్డి, చంపాపేటకు చెందిన కేవీఆర్ ఫ్లవర్మర్చంట్కందాడ శాలిని వీరేందర్ రెడ్డి, హస్తినాపురానికి చెందిన కంచర్ల శివారెడ్డి, జీఎన్ఆర్ డెవలపర్స్ గడ్డం నవీన్ రెడ్డి, బాలాపూర్ కు చెందిన ఇబ్రామ్ ప్రత్యూష్, పీఎస్ కే గ్రూప్ శ్రీకాంత్, ది సుషీ కంపెనీ కి చెందిన లండన్ సెటిలర్స్..సామ దయానంద్ రెడ్డి, సామ వరానంద్ రెడ్డి ఉన్నారు.