
కోలీవుడ్ హీరో కార్తి మరోసారి ఖాకీ చొక్కాలో కనిపించబోతున్నాడు. ఆయన హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. ఆగస్టు తొలివారంలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో కార్తి పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నాడని సమాచారం. తనకు జంటగా త్రిష ఇందులో హీరోయిన్‌గా నటించబోతోందనే ప్రచారం జరుగుతోంది. కార్తి కెరీర్‌లో పోలీస్ సినిమా అనగానే ‘ఖాకీ’ సినిమా ఎక్కువ గుర్తొస్తుంది. అయితే యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి చక్కని కమర్షియల్ డ్రామాగా దీన్ని తెరకెక్కించబోతున్నాడట మోహన్ రాజా.
తను గతంలో తెరకెక్కించిన ‘తనీ ఒరువన్’ తెలుగులో (రామ్ చరణ్ ధ్రువ) తరహా పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ షేడ్స్ ఉంటూనే.. ‘ఎమ్ కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి’ (అమ్మా, నాన్న ఓ తమిళమ్మాయి రీమేక్) తరహాలో మదర్ సెంటిమెంట్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది.
డిసెంబర్ నుంచి ఇది సెట్స్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ : కోటి 50 ఏళ్ల సినీ కెరీర్ సెలబ్రేషన్స్..
ఇక ప్రస్తుతం మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార సంస్థ నిర్మిస్తున్న తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు కార్తి. అలాగే తమిళంలో ‘మార్షల్’ అనే సినిమా రూపొందుతోంది. మారి సెల్వరాజ్, సుందర్ సి డైరెక్షన్‌లో తన అప్‌కమింగ్ సినిమాలు ఉండబోతున్నట్టు సమాచారం.
BUZZ: Karthi as a Cop Again? 👀🔥
Karthi’s upcoming film, produced by Prince Pictures and directed by #MohanRaja, is said to be a fast-paced police-based action drama.
While the film is expected to have Mohan Raja’s trademark commercial treatment, a strong mother sentiment is… pic.twitter.com/YpZFc54GUN
— FilmyBowl Tamil (@FilmyBowlTamil) September 23, 2026