Reading Time: 3 minutes

Bada Ganesh Nimajjanam: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం లైవ్ అప్ డేట్స్

Caption of Image.
  • ‘‘ఆయా షేర్’’ పాటకు మహిళా పోలీసులతో కలిసి డ్యాన్స్ చేసిన దానం
  • ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్రలో దానం నాగేందర్ సందడి
  • అనర్హతను లైట్ తీస్కుని ఫుల్ జోష్లో దానం నాగేందర్
  • ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటన
  • ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మూసివేత
  • బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 18 కిలోమీటర్ల శోభా యాత్ర
  • శనివారం సాయంత్రం వరకూ అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు
  • ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం
  • మూడు గంటల ఆలస్యంగా మొదలైన శోభా యాత్ర
  • టస్కర్ పైకి ఖైరతాబాద్ బడా గణనాథుడు
  • విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం నుంచి ముందుకు సాగిన శోభాయాత్ర
  • గణేష్ నిమజ్జనంలో విషాదం…ఓ వ్యక్తి మృతి
  • నిమజ్జనం కోసం వచ్చిన వ్యక్తి వాహనం కింద పడి మృతి 
  • ఖైరతాబాద్ జంక్షన్ సమీపంలో మెట్రో పిల్లర్ నంబర్ 1167 దగ్గర ఘటన
  • ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • మృతుడి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
  • మొజాంజాహి మార్కెట్‌ దగ్గర ఇప్పుడిప్పుడే మొదలవుతున్న గణేష్ నిమజ్జనం సందడి
  • ఓల్డ్ సిటీ, బేగం బజార్ ప్రాంతాల నుంచి నిమజ్జనం కోసం తరలివస్తున్న చిన్న చిన్న గణనాథుల విగ్రహాలు
  • భారీ గణనాథులు ఇంకా రానుండటంతో.. ప్రస్తుతం మొజాంజాహి మార్కెట్‌ పరిసరాల్లో పూర్తి స్థాయిలో అమల్లోకి రాని ట్రాఫిక్‌ ఆంక్షలు
  • భారీ విగ్రహాలు తరలివచ్చే సమయానికి ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినతరం చేసే అవకాశం
  • భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా TGSRTC భారీ ఏర్పాట్లు
  • 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులు
  • హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ రూట్లకు నిరంతరాయంగా ప్రత్యేక బస్సులు
  • హైదరాబాద్ సిటీలో నిమజ్జనాలు.. సుమారు 20 వేల మంది పోలీసులు విధుల్లో..
  • ఇతర జిల్లాల నుంచి మరో 8,142 మంది అధికారులు, సిబ్బందిని రప్పించి 42 ప్లాటూన్లుగా ఏడు జోన్లలో మోహరింపు
  • చార్మినార్‌‌, గోల్కొండ, రాజేంద్రనగర్‌‌, శంషాబాద్‌‌ ప్రాంతాల్లో నాలుగు ఆర్‌‌ఏఎఫ్‌‌ కంపెనీలు, ఖైరతాబాద్‌‌, సికింద్రాబాద్‌‌లో రెండు సీఆర్‌‌పీఎఫ్‌‌ కంపెనీల మోహరింపు
  • 53 బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్లు కూడా బందోబస్తులో..
  • కీలక ప్రాంతాల్లో 24 డ్రోన్లతో నిఘా..
  • 100 హైరైజ్‌‌ కెమెరాలను ఏర్పాటు చేసి విగ్రహాల రాకను నిరంతర పర్యవేక్షణ
  • ఎన్టీఆర్‌‌ మార్గ్‌‌, పీపుల్స్‌‌ ప్లాజా, నెక్లెస్‌‌ రోడ్‌‌, మొఘల్‌‌పురా స్పోర్ట్స్‌‌ కాంప్లెక్స్‌‌ వద్ద కంట్రోల్‌‌ రూమ్‌‌లు ఏర్పాటు
  • శంషాబాద్ ఎయిర్​పోర్ట్కు వెళ్లేవారు లేదా వచ్చేవారు నెక్లెస్​ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్​ రోడ్డును పూర్తిగా నివారించి పీవీఎన్​ఆర్ ​ఎక్స్​ప్రెస్​వే లేదా ఔటర్​ రింగ్ రోడ్డునే ఉపయోగించాలని సూచించిన పోలీసులు
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌‌‌కు వెళ్లే వారు బేగంపేట, ప్యారడైజ్ ఫ్లై ఓవర్, సంగీత్ చౌరస్తా రూట్ను ఎంచుకోవాలని సూచన
  • సహాయం అవసరమైతే 040-27852482, 8712660600, 9010203626 లకు కాల్​చేయాలని సూచన
  • ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం.. సొంత వాహనాల్లో వెళ్లే భక్తులకు అలర్ట్
  • ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
  • కార్లు, బైకులపై ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చేవారు వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంగణంలో పార్క్ చేయాలి.
  • నెక్లెస్ రోటరీ , ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు నుంచి వచ్చేవారి కోసం ఐమ్యాక్స్ థియేటర్ పక్కనున్న హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు.
  • ఐమ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటు ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆవరణను, రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్ పరిసరాలను కూడా పార్కింగ్కు కేటాయించారు.
  • నిమజ్జనం సందర్భంగా మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగింపు
  • చివరి మెట్రో రైలు శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు
  • అన్ని టెర్మినల్ స్టేషన్ల (మియాపూర్, ఎల్బీ నగర్, నాగోల్, రాయదుర్గ్, జేబీఎస్, ఫలక్‌‌‌‌నుమా) నుంచి నడుస్తాయి
  • దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్ మీదుగా 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడుపుతోంది
  • ఆలస్యం కానున్న ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర
  • క్రేన్ సాంకేతిక లోపం తో ఇంకా టస్కర్ పైకి చేరని బడా గణేష్
  • ప్రతి సంవత్సరం శోభాయాత్ర ముందు రోజు రాత్రి టస్కర్ పైకి బడా గణేష్ చేర్చే అవకాశం
  • కానీ ఈ సంవత్సరం మాత్రం సాంకేతిక లోపంతో ఆలస్యం
  • బడా గణేష్ లిఫ్ట్ చేసే క్రేన్ సాంకేతిక సమస్య
  • విరిగిన బాహుబలి క్రేన్ పైప్
  • ఇంకా టస్కర్ పై చేరని మహాగణపతి
  • మరి కొద్ది సేపట్లో క్రేన్ సహాయంతో టస్కర్ పైకి చేర్చే అవకాశం
  • ఆ తర్వాత దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు సాగనున్న సపోర్టింగ్ వెల్డింగ్ వర్క్స్
  • గంట రెండు గంటల ఆలస్యంగా మొదలు కానున్న ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర

నిమజ్జనోత్సవంలో అందరి చూపు ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకట హర మహాగణపతి వైపే ఉంది. బుధవారం అర్ధరాత్రి నుంచే దర్శనాలు బంద్​ చేసినా గురువారం కూడా భక్తులు తరలివచ్చారు. 

భారీ టస్కర్​పై వినాయకుడిని నిలిపేందుకు వెల్డింగ్​పనులు పూర్తి కావచ్చాయి. మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయ్యేలా ఆఫీసర్లు ప్లాన్​చేశారు.

ఈ ర్యాలీ పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ మీదుగా కొనసాగి.. అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్‌‌టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మీదుగా నాలుగో నంబర్​క్రేన్​వద్దకు చేరుకుంటుంది.

బందోబస్తు కోసం 204 మంది పోలీసులను నియమించారు. 15 పుషింగ్ పార్టీ వాహనాలు, నాలుగు మొబైల్ క్రేన్లు, 16 ఫుట్ పెట్రోలింగ్ పార్టీలు, ఐదు పికప్ వాహనాలను వినియోగించనున్నారు.

©️ VIL Media Pvt Ltd.