
విగ్రహాల నిమజ్జనం చేసిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్, ఎగువ చెరువు కట్ట, పీవీఎన్‌ఆర్ మార్గాల్లో నిమజ్జనం పూర్తి చేసుకున్న ఖాళీ లారీలు, ట్రక్కులు ప్రత్యేకంగా కేటాయించిన మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.
నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపి కాలినడకన వెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు నుంచి వచ్చేవారు ఐమ్యాక్స్ గ్రౌండ్స్, హెచ్ఎండీఏ లేక్ వ్యూ పార్కింగ్ , ఎన్టీఆర్ పార్క్ వెనుక ఉన్న ఈ- రేసింగ్ గ్రౌండ్లో వాహనాలను నిలపవచ్చు.
నెక్లెస్ రోడ్ వైపు నుంచి వచ్చేవారు ప్రధాన పార్కింగ్ స్థలాలు నిండిపోతే, ప్రత్యామ్నాయంగా మక్తా పార్కింగ్ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. టెలిఫోన్ భవన్ పరిసరాల్లో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే పార్కింగ్ అందుబాటులో ఉంటుంది.
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ట్యాంక్ బండ్ పరిసరాల్లో సాధారణ వాహనాలకు ప్రవేశం లేదు. వీవీ స్టాచ్యూ వైపు నుంచి ఫ్లై ఓవర్మీదుగా ..రాజీవ్ గాంధీ విగ్రహం.. మింట్ కాంపౌండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. పాత పీఎస్ సైఫాబాద్ నుంచి రాజ్‌దూత్ లేన్ మీదుగా ఖైరతాబాద్ బడా గణేశ్వైపు వచ్చే వెహికల్స్‌ను ఇక్బాల్ మినార్ వైపు టర్న్చేస్తారు.
ఇక ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ వైపు వెళ్లే వాహనాలను మింట్ కాంపౌండ్ లేన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు తరలిస్తారు. నిరంకారి నుంచి ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు పంపిస్తారు.