
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లేవారు లేదా వచ్చేవారు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ రోడ్డును పూర్తిగా నివారించి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే లేదా ఔటర్ రింగ్ రోడ్డునే ఉపయోగించాలని సూచించిన పోలీసులు
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు బేగంపేట, ప్యారడైజ్ ఫ్లై ఓవర్, సంగీత్ చౌరస్తా రూట్ను ఎంచుకోవాలని సూచన
- సహాయం అవసరమైతే 040-27852482, 8712660600, 9010203626 లకు కాల్చేయాలని సూచన
- ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం.. సొంత వాహనాల్లో వెళ్లే భక్తులకు అలర్ట్
- ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
- కార్లు, బైకులపై ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చేవారు వాహనాలను విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంగణంలో పార్క్ చేయాలి.
- నెక్లెస్ రోటరీ , ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు నుంచి వచ్చేవారి కోసం ఐమ్యాక్స్ థియేటర్ పక్కనున్న హెచ్ఎండీఏ పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు.
- ఐమ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటు ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆవరణను, రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్ పరిసరాలను కూడా పార్కింగ్కు కేటాయించారు.
- నిమజ్జనం సందర్భంగా మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగింపు
- చివరి మెట్రో రైలు శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు
- అన్ని టెర్మినల్ స్టేషన్ల (మియాపూర్, ఎల్బీ నగర్, నాగోల్, రాయదుర్గ్, జేబీఎస్, ఫలక్‌నుమా) నుంచి నడుస్తాయి
- దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్ మీదుగా 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడుపుతోంది
- ఆలస్యం కానున్న ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర
- క్రేన్ సాంకేతిక లోపం తో ఇంకా టస్కర్ పైకి చేరని బడా గణేష్
- ప్రతి సంవత్సరం శోభాయాత్ర ముందు రోజు రాత్రి టస్కర్ పైకి బడా గణేష్ చేర్చే అవకాశం
- కానీ ఈ సంవత్సరం మాత్రం సాంకేతిక లోపంతో ఆలస్యం
- బడా గణేష్ లిఫ్ట్ చేసే క్రేన్ సాంకేతిక సమస్య
- విరిగిన బాహుబలి క్రేన్ పైప్
- ఇంకా టస్కర్ పై చేరని మహాగణపతి
- మరి కొద్ది సేపట్లో క్రేన్ సహాయంతో టస్కర్ పైకి చేర్చే అవకాశం
- ఆ తర్వాత దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు సాగనున్న సపోర్టింగ్ వెల్డింగ్ వర్క్స్
- గంట రెండు గంటల ఆలస్యంగా మొదలు కానున్న ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర
నిమజ్జనోత్సవంలో అందరి చూపు ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకట హర మహాగణపతి వైపే ఉంది. బుధవారం అర్ధరాత్రి నుంచే దర్శనాలు బంద్ చేసినా గురువారం కూడా భక్తులు తరలివచ్చారు.
భారీ టస్కర్పై వినాయకుడిని నిలిపేందుకు వెల్డింగ్పనులు పూర్తి కావచ్చాయి. మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయ్యేలా ఆఫీసర్లు ప్లాన్చేశారు.
ఈ ర్యాలీ పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ మీదుగా కొనసాగి.. అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్‌టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మీదుగా నాలుగో నంబర్క్రేన్వద్దకు చేరుకుంటుంది.
బందోబస్తు కోసం 204 మంది పోలీసులను నియమించారు. 15 పుషింగ్ పార్టీ వాహనాలు, నాలుగు మొబైల్ క్రేన్లు, 16 ఫుట్ పెట్రోలింగ్ పార్టీలు, ఐదు పికప్ వాహనాలను వినియోగించనున్నారు.