Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాములేరు వాగుపై కూలిన బ్రిడ్జి

Caption of Image.

ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట గ్రామ శివారులో పాములేరు వాగుపై ఉన్న బ్రిడ్జి బుధవారం రాత్రి వరద ప్రవాహానికి కూలింది. పాల్వంచ–దమ్మపేట ప్రధాన రహదారి కావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈ ఏడాది తొలిసారిగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ బ్రిడ్జి కూలింది.

బ్రిడ్జి నిర్మించి 30 ఏళ్లు గడుస్తుండగా, 15 ఏండ్ల కింద రిపేర్లు చేశారు. గత ఏడాది వరదలకు  వాగులో భారీ వృక్షాలు కొట్టుకొచ్చి బ్రిడ్జి వద్ద అడ్డుపడడంతో బ్రిడ్జి దెబ్బతిన్నది. 20 రోజుల కింద బ్రిడ్జికి ఇరువైపులా రిపేర్లు చేశారు. ప్రస్తుతం ఈ మార్గం గుండా నడిచే వాహనాలను కంపగూడెం, గొల్లగూడెం మీదుగా మళ్లించారు.

©️ VIL Media Pvt Ltd.