Reading Time: < 1 minute

ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్రకు ఎం. రషీద్‌‌ పురస్కారం

Caption of Image.
  • సాహిత్యం, సామాజిక రంగాల్లో విశేష కృషికి దక్కిన గుర్తింపు

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత్రి, దళిత ఉద్యమకారిణి జూపాక సుభద్రను కేరళకు చెందిన ప్రతిష్టాత్మక ఎం. రషీద్‌‌ ఫౌండేషన్‌‌ అవార్డు వరించింది. సాహిత్యం, సంస్కృతి, సాంఘిక సంస్కరణలు, మానవ హక్కుల పరిరక్షణ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ ఏడాదికి గాను జూపాక సుభద్రను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్‌‌ 5వ తేదీన కేరళలోని త్రిసూర్‌‌ సాహిత్య అకాడమీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

కాగా, కేరళకు చెందిన మహ్మద్‌‌ రషీద్‌‌ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సీనియర్‌‌ జర్నలిస్ట్‌‌, రచయిత, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌‌ఎస్‌‌పీ) తొలి తరం నాయకుడిగా ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన స్మారకార్థం ఏర్పాటైన రషీద్‌‌ ఫౌండేషన్‌‌ ఏటా సామాజిక ఉద్యమకారులు, సాహితీవేత్తలకు ఈ అవార్డును ప్రదానం చేస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.