Reading Time: < 1 minute
PhonePe: ఫోన్‌పే భారీ విస్తరణ.. 20,000 ఉద్యోగాలు

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ‘ఫోన్‌పే’ భారత్‌లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. దేశంలోని మారుమూల గ్రామాలు, చిన్న పట్టణాలకు డిజిటల్ చెల్లింపుల సేవలను అందుబాటులోకి తేడమే లక్ష్యంగా వచ్చే ఏడాది కాలంలో ఏకంగా 20,000 మందికి పైగా ఫ్రంట్‌లైన్ సేల్స్ సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ బృహత్ ప్రణాళిక ద్వారా రాబోయే 12 నెలల్లో దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా స్మార్ట్‌స్పీకర్‌లు, పీఓఎస్ మెషీన్లు వంటి పేమెంట్ పరికరాలను ఏర్పాటు చేయాలని ఫోన్‌పే భావిస్తోంది. అందులో సగానికి పైగా, అంటే 25 లక్షల డివైజ్‌లను టైర్-6 పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఫ్రేమ్‌వర్క్ మరియు నూతన కార్మిక చట్టాలు కంపెనీ పెట్టుబడులకు, వేగవంతమైన నియామకాలకు ఎంతగానో దోహదపడ్డాయి. ఈ విస్తరణ వల్ల లక్షలాది మంది చిరు వ్యాపారులు డిజిటల్ నెట్‌వర్క్‌లోకి రావడమే కాకుండా కేవైసీ పూర్తయి, భవిష్యత్తులో బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందే అవకాశం దక్కుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijayawada: ఏపీలో భారీ వర్షాలు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద