Reading Time: < 1 minute
Sheetalnath Temple Reopens In Srinagar After Decades Kashmiri Pandits Offer Prayers

Sheetalnath Temple: జమ్మూ కాశ్మీర్‌ శ్రీనగర్ లోని హబ్బా కడల్ ప్రాంతంలో చారిత్రాత్మక శీతల్‌నాథ్ ఆలయం 36 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. మూడు దశాబ్ధాల తర్వాత ఆలయంలో వేద మంత్రాలు వినిపించాయి. భక్తులు పెద్ద ఎత్తున ఈ గుడి పునరుద్ధరణకు హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాశ్మీరీ పండితులు ప్రత్యేక పూజల్లో హాజరయ్యారు. ఆలయ పున:ప్రారంభానికి స్థానిక కాశ్మీరీ ముస్లిం కుటుంబాలు కూడా హాజరై, వేద పండితులను స్వాగతించారు.

దీర్ఘకాలికంగా మూసివేత, నిర్లక్ష్యంగా కారణంగా దెబ్బతిన్న ఆలయ సముదాయాన్ని శ్రీనగర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్, జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక శాఖ సహకారంతో పునరుద్ధరించారు. గర్భగుడి, హవనశాలతో పాటు ఆలయ సముదాయంలోని పలు ప్రాంతాలను అభివృద్ధి చేశారు. జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ అతల్ దుల్లో ఆలయ పునరుద్ధరణను ప్రారంభించారు.

శీతల్‌నాథ్ ఆలయానికి మత, సాంస్కృతికలో ప్రత్యేకస్థానం ఉంది. శ్రీనగర్‌ను రక్షించే 8 భైరవుల్లో ఒకరికి ఈ ఆలయం సంబంధించిందిగా చెబుతారు.1990లలో తీవ్రవాదం పెరగడం, కాశ్మీరీ పండితులపై దాడుల తర్వాత వారంత వేరే ప్రాంతాలకు వెళ్లడంతో ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురైంది. 1991లో అగ్నిప్రమాదానికి గురైంది. దీని తర్వాత సనాతన్ ధర్మ సభ ఆలయ సంరక్షణ, మరమ్మతుల్లో కీలక పాత్ర పోషించింది.