
భారీ బ్యాటరీతో పాటు బలమైన నిర్మాణం కావాలనుకునేవారిని లక్ష్యంగా చేసుకుని వన్‌ప్లస్ N6 లైట్ వచ్చింది. ఇందులో 6.75 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 5G కనెక్టివిటీ ఉన్నాయి. 50MP వరకు ఫొటోలు తీసే అవకాశం, AI ఆధారిత ఫొటో ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Oxygen OS 16పై పనిచేసే ఈ ఫోన్‌లో 2TB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు. ధర రూ.16,999గా ఉంది.
7,000mAh బ్యాటరీ..
ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది. సాధారణ వాడకంలో మూడు రోజుల వరకు బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. 55.5 గంటల వాయిస్ కాలింగ్, 29.9 గంటల నావిగేషన్, 26.8 గంటల వీడియో ప్లేబ్యాక్ చేయొచ్చు. 15W వైర్డ్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ ఉన్నాయి. 1,600 ఛార్జింగ్ సైకిల్స్ తర్వాత కూడా 80 శాతానికి పైగా బ్యాటరీ సామర్థ్యం ఉంటుందని కంపెనీ పేర్కొంది.
6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. నీరు, తేమ, ఆయిల్ ఉన్నా టచ్ పనిచేసేలా ఆక్వా టచ్ టెక్నాలజీ ఉంది. ఫోన్ మందం 8.95 మిల్లీమీటర్లు, బరువు 215 గ్రాములు. MIL-STD-810H సర్టిఫికేషన్, IP64 రక్షణ ఉన్నాయి.
13MP కెమెరా..
వెనుక 13MP కెమెరా ఉంది. హై-రెజల్యూషన్ మోడ్‌లో 50MP వరకు ఫొటోలు తీయొచ్చు. 5MP ఫ్రంట్ కెమెరా అందించారు. AI క్లియర్ పేస్, AI రేజర్ ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ జెమిని సాయం కూడా లభిస్తుంది. 12nm UNISOC T7250 ప్రాసెసర్, Mali-G57 MP1 GPU, 4GB LPDDR4X RAM, 64GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోSD కార్డుతో 2TB వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16పై పనిచేస్తుంది.
5G, Wi-Fi 6, Bluetooth 5.2, డ్యూయల్ సిమ్, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, USB Type-C ఉన్నాయి. 4GB+64GB వేరియంట్ ధర రూ.16,999. బ్యాంక్ EMI ఆఫర్లతో రూ.16,249కి లభిస్తుంది. మిడ్ నైట్ హైప్, నియో గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.