Reading Time: < 1 minute
Emraan Hashmi And Himesh Reshammiya Reunite After 20 Years

బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ హీరోగా మార్కెట్ డల్ కావడంతో యాంటోగనిస్ట్ రోల్స్‌కు షిఫ్టయ్యాడు. కానీ ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగా ప్రయత్నాలు ఆపలేదు. అలా వర్కౌట్ అయిన సినిమానే ఆవారా పన్2. ఆవారాపన్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా 200 కోట్లకు పైగా కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఆవారాపన్2తో ఆడియన్స్ తన నుండి ఏ కావాలని కోరకుంటున్నారో ఇమ్రాన్ హష్మీకి ఇప్పటికీ బోధపడినట్లుంది. నెక్ట్స్ సినిమాలో కూడా లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ మిస్ కాకుండా చూసుకుంటున్నాడు.

అలాగే నోస్టాల్జియా ఫీలింగ్ కోసం ఒకప్పుడు తనకు బ్లాక్ బస్టర్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియాతో చేతులు కలిపాడు. 20 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతోంది.
2000వ దశకంలో ఇమ్రాన్ అండ్ హిమేష్ కాంబో యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. వీరు వర్క్ చేసిన ఆషిక్ బనాయా ఆప్నే, అక్సర్ చిత్రాల్లోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ ఈ కాంబో గన్ మాస్టర్ జీ9తో హీరో అండ్ కంపోజర్ కొలాబరేట్ కాబోతున్నారు. జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఆదిత్య దత్ దర్శకుడు. రీసెంట్లీ రిలీజ్ చేసిన పాటలో జెనీలియా వెంటపడుతూ.. హిమేష్ వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ వింటేజ్ ఇమ్రాన్ గుర్తు చేస్తున్నాడు హీరో. నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ స్పై థ్రిల్లర్.