Reading Time: < 1 minute
Bengaluru Murder Womans Body Found In Vacant Plot Husband Arrested

Bengaluru: బెంగళూర్ మున్సిపల్ సంస్థ ఖాళీ ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహిస్తు్న క్రమంలో, ఒక స్థలంలో కూలీలకు మహిళకు చెందిన కుళ్లిపోయిన మృతదేహం లభించింది. చివరకు ఈ డెడ్‌బాడీ దారుణ హత్యకు గురైన మహిళదని పోలీసుల దర్యాప్తులో తేలింది. భర్తనే ఆ మహిళను హత్య చేసినట్లుగా గుర్తించారు. హత్య చేసిన తర్వాత భార్య మృతదేహాన్ని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు.

28 ఏళ్ల మహిళ హత్యను సంపిగెహళ్లి పోలీసులు ఛేదించారు. బీహార్‌కు చెందిన సాగర్ చంద్ర రావత్(32), తన భార్య అనసూయ బెహరా(28)ని హత్య చేసిన ఆరోపణలతో అరెస్టయ్యాడు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకుని, బతుకుదెరువు కోసం బెంగళూర్ వచ్చారు. రావత్ ఒక హోటల్‌లో పనిచేస్తుండగా, అనసూయ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరికి ఆర్థిక విషయాలో తరుచూ గొడవలు జరిగేవని, ఈ నేపథ్యంలోనే ఆగస్టు 11న రావత్ అనసూయపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. హత్య తర్వాత మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని, ఆ తర్వాత ఒక దుప్పటిలో మృతదేహాన్ని చుట్టి, సంపిగెహల్లీ ప్రాంతంలోని ఒక ఖాళీ ప్రదేశంలో పారేశాడు.

బట్టల ట్యాగ్‌లో హత్యను ఛేదించిన పోలీసులు..

మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో మహిళ గుర్తింపును కనుక్కోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే మృతదేహంపై ఉన్న బట్టల ట్యాగ్ ఆధారంగా, ఒక మాల్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత నిందితుడు, మృతురాలని పోలీసులు గుర్తించగలిగారు. హత్య తర్వాత కూడా రావత్ హోటల్‌లో తన విధులకు హాజరవుతున్నట్లు తేలింది.