Reading Time: < 1 minute
ఖైర‌తాబాద్ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతో తెలిస్తే..

ఖైరతాబాద్‌ అంటే భారీ గణపతి.. భారీ గణపతి అంటే నిమజ్జన శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో వేల టన్నుల బరువు ఉన్న విగ్రహాన్ని మోసే భారీ వాహనాన్ని నడపడం అత్యంత కీలకం. లక్షలాది మంది భక్తులు రోడ్డుకిరువైపులా ఉంటారు.. వారి మధ్య.. అత్యంత అప్రమత్తంగా.. అతి తక్కువ వేగంతో ట్రక్కును ముందుకు తీసుకెళ్లాలి. చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా భారీ వాహనాన్ని నడపడం ఒక ఎత్తయితే.. బాహుబలి గణపతిని నిమజ్జనానికి చేర్చడం మరో ఎత్తు. అందుకే డ్రైవర్‌కు అనుభవం, ఏకాగ్రత అత్యంత కీలకం. అందుకే ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్రలో విగ్రహం ఎంత ప్రత్యేకమో.. ఆ విగ్రహాన్ని సురక్షితంగా గమ్యానికి చేర్చే రథసారథి కూడా అంతే ప్రత్యేకం.

సూర్యాపేట జిల్లా వాసి…

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఖైరతాబాద్‌ గణేశుడికి రథసారథిగా వ్యవహరించడం మామూలు వ్యవహారం కాదు. ఇలాంటి క్లిష్టమైన బాధ్యతను నిర్వర్తించే అవకాశం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ముక్కుడుదేవులపల్లికి చెందిన మందడి వెంకటరెడ్డికి దక్కింది. వెంకటరెడ్డికి మాత్రం ఇది కొత్త కాదు.. ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్రలో ఇప్పటికే మూడుసార్లు ట్రక్కును నడిపిన అనుభవం ఆయన సొంతం.

ట్రాన్స్ పోర్ట్ లో 26 ఏళ్ల అనుభవం..

విజయవాడకు చెందిన ఎస్టీసీ ట్రాన్స్‌పోర్ట్‌లో 26 ఏళ్లుగా మందడి వెంకట్ రెడ్డి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. భారీ వాహనాలను నడపడంలో ఉన్న అనుభవమే.. ఆయనకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్రలో ప్రత్యేక బాధ్యతను తెచ్చిపెట్టింది. 2017లో తొలిసారి ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్రలో భారీ ట్రక్కును నడిపారు. ఆ తర్వాత 2020లోనూ.. 2025లోనూ అదే బాధ్యత నిర్వర్తించారు. ఇప్పుడు మరోసారి అవకాశం దక్కింది.

వినాయకుడి కృప…

బాహుబలి గణపతికి రథసారథిగా నాలుగుసార్లు అవకాశం.. డ్రైవర్ వెంకటరెడ్డి అదృష్టంగా భావిస్తున్నారు. వినాయకుడి కృపతోనే నాలుగు సార్లు ఈ అవకాశం వచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈసారి కూడా అదే నమ్మకంతో బాధ్యత నిర్వర్తిస్తానని” వెంకటరెడ్డి చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..