
వివస్వాన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మత్స్య’. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వంలో సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. ఇదొక ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిల్మ్. గురువారం టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. అమ్మా కొత్త బెడ్ టైమ్ కథ చెప్పమ్మా..! అంటూ బాబు అమ్మను అడగగా, ఒక ఫిష్ కథ చెప్పనా అంటూ అమ్మ చెప్పే డైలాగ్ తో గ్లింప్స్ మొదలవుతుంది.
ఎన్నో వింతలు, అద్భుతాలు, ఒక ట్రావెలర్ ఉండే ఆ కథను అమ్మ చెబుతుంటే హీరో క్యారెక్టర్‌ను కలర్‌ఫుల్‌గా పరిచయం చేశారు. ఇందులో వివస్వాన్ స్టైలిష్ లుక్, అప్పియరెన్స్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.