Reading Time: < 1 minute

సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేకు.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Caption of Image.

జంతర్ మంతర్ నిరసనల్లో ఓ మహిళ ఫొటోల ప్రదర్శనపై ఢిల్లీ హైకోర్టు సీజేపీ ప్రతినిధులకు ఢీల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీజేపీ చీఫ్  అభిజిత్ దీప్కే తోపాటు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా, రత్న సింగ్‌ లకు నోటీసులిచ్చింది. అనుమతి లేకుండా  తన ఫొటోలు తీసి డిజిటల్  మార్పింగ్ చేశారని ఓ మహిళనుంచి ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన కోర్టు ఈ చర్యలు తీసుకుంది. అక్టోబర్ 2న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ రెడీ అవుతున్న క్రమంలో హైకోర్టు నోటీసులు చర్చనీయాంశమయ్యాయి. 

తన అనుమతి లేకుండా ఫోటో తీసి, ఆ తర్వాత ఏఐ, ఫేస్-స్వాపింగ్ టూల్స్ ఉపయోగించి డిజిటల్‌గా మార్ఫింగ్ చేశారని ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం.. ప్రధాని మోదీతో కలిసి ఉన్న తన ఫోటోపై ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేశారని ఆరోపించింది. ఫిర్యాదులో సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంకా, రత్న సింగ్‌లతో పాటు వారి సహచరులుగా ఆరోపించబడిన కొందరి పేర్లను పేర్కొంది.

జంతర్ మంతర్ నిరసనల్లో మార్ఫింగ్ చేసిన తన ఫొటోలను ప్రచారం చేయడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ కేసులో  మహిళకు పూర్తి రక్షణ కల్పించాలని శుక్రవారం ఢిల్లీ హైకోర్టు  పోలీసులను ఆదేశించింది. 

మహిళ భద్రతకోసం ఆమె అడ్రస్ సీక్రెట్ గా ఉంచాలని పోలీసులకు సూచించింది. దీంతోపాటు వెబ్ లింకులనుంచి , సోషల్  మీడియా ప్లాట్ ఫాంలనుంచి ఆమె ఫొటోలను తొలగించాలని మెటాకు ఆదేశించింది. ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో ఉండగా, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సీఈసీ రాజీనామా చేయాలని అక్టోబర్ 2న సీజేపీ తలపెట్టిన  దేశవ్యాప్త నిరసనలకు ముందు హైకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

©️ VIL Media Pvt Ltd.