
48 గంటల్లోగా కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని అల్టీమేటం జారీ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియ, ఈసీ జ్ణానేష్ కుమార్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన సీజేపీ ఆయనను దేశద్రోహిగా అభివర్ణించింది.
CEC రాజీనామాతో పాటు, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా CJP డిమాండ్ చేసింది. ఓటర్ లిస్టు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ , ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేయాలని కూడా సీజేపీ డిమాండ్ కోరింది.
జ్ణానేష్ కుమార్ పై అభిజీత్ దిప్కే విమర్శలు..
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి జ్ణానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు దిప్కే. జ్ణానేష్ కుమార్ ఎవరు ఓటు వేయాలి, ఎవరు ఓటు వేయకూడదని అర్హతను నిర్ణయించడాన్ని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య భావననే తలకిందులు చేసిందని , జ్ణానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఓట్ల తొలగింపులో జ్ణానేష్ కుమార్ పాత్ర ఉందని, అతనే అతిపెద్ద దేశద్రోహి అని దీప్కే ఆరోపించారు. ప్రజాస్వామ్యంలోప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.. జ్ణానేష్ కుమార్ చర్యలతో దేశంలోని ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ఓటర్ల పేర్లను తొలగించే లక్ష్యంగా ఓ సిస్టమ్ పనిచేసిందని దిప్కే ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఏకమైన అనేక ప్రాంతీయ నేతలను భారీ సంఖ్యలో ఓట్లు తొలగించడం ద్వారా ఓడిపోయేలా చేశారని దీప్కే అన్నారు.
సర్ తో ఓట్ల తొలగింపు, బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం చేసిన మేలును దీప్కే బట్టబయలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించలేకపోయింది. మెజారిటీ రాకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ‘400 పార్’ అనే నినాదం ఇచ్చినప్పటికీ, వారు 240 సీట్లకు పరిమితమయ్యారు. ఆ తర్వాత, దేశంలో ప్రజాభిప్రాయం మారుతోందని, ప్రాంతీయ శక్తులు బలపడపడ్డాయని గ్రహించిన బీజేపీ, ఎలక్షన్ కమిషన్ చీఫ్ కుట్రకు తెరలేపారని CJP వ్యవస్థాపకుడు ఆరోపించారు.
ఎన్నికల్లో ప్రతిపక్ష నేతలు, ప్రాంతీయ పార్టీల చీఫ్ ల ఓటమిపై ప్రస్తావిస్తూ .. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ,ఢిల్లీ ఉదాహరణలను ఎత్తిచూపారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే, ఎన్‌సీపీ (NCP), ఎం.కె. స్టాలిన్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్ , మమతా బెనర్జీ… ఇలా ఈ ముఖ్యమంత్రులందరూ ఒక్కొక్కరుగా ఓడిపోయారు. ఇది యాదృచ్ఛికం కాదని, 2024 ఎన్నికల్లో ఉమ్మడిగా ప్రచారం చేసిన వారంతా ఒక్కొక్కరుగా ఎలా ఓడిపోయారని దీప్కే ప్రశ్నించారు. వీరందరి ఓటమి వెనక పక్కా ప్రణాళిక ఉందన్నారు.