Reading Time: 2 minutes

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్.. ఆ ముగ్గురిలో లోపలికి అడుగుపెట్టేది ఎవరంటే?

Caption of Image.

‘బిగ్ బాస్ తెలుగు 10’ బుల్లితెరపై ట్విస్టుల పర్వంతో రసవత్తరంగా సాగుతోంది. రోజురోజుకూ ఊహించని పరిణామాలతో హౌస్‌లో కాకరేగుతుండగా.. 18వ రోజు ఎపిసోడ్ వీక్షకులకు మైండ్ బ్లాకింగ్ డ్రామాను అందించింది. ఒకవైపు కెప్టెన్సీ టాస్కుల రచ్చ, మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య… బిగ్ బాస్ ప్రయోగించిన ‘వైల్డ్ కార్డ్ ఎంట్రీ’ బాంబ్ హౌస్‌మేట్స్‌కు గట్టి షాకే ఇచ్చింది. 

ముందుగా బజర్ టాస్క్‌లో సంచాలక్ త్రిగుణ్ తీసుకున్న నిర్ణయం పెద్ద రచ్చకే దారితీసింది. వంశీ, నరేష్‌ల పోటీలో త్రిగుణ్ తొలుత నరేష్ అని చెప్పి, ఆ తర్వాత కన్ఫ్యూజ్ అయ్యానంటూ వంశీని విజేతగా ప్రకటించడంతో నరేష్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అనంతరం జరిగిన పోరులో ఝాన్సీ పైచేయి సాధించి కెప్టెన్సీ పోటీదారుగా నిలవడమే కాకుండా, తన తండ్రి లెటర్ కోసం నరేష్ లెటర్‌ను త్యాగం చేసే కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో ముఖేష్, అమన్, సృష్టిలతో పాటు ఝాన్సీ కూడా కెప్టెన్సీ రేసులో నిలిచారు.

అయితే అసలు సిసలైన డ్రామా ఆ తర్వాతే మొదలైంది. హౌస్‌మేట్స్ ఆటతీరుపై బయట నుంచి వచ్చిన విమర్శల వీడియోలను ప్రదర్శించడంతో కంటెస్టెంట్లు షాక్ తిన్నారు. వర్షిణితో ఉంటూ ముఖేష్ గేమ్ పక్కన పెట్టాడని, రామ్ ప్రసాద్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, షాలిని మాటలు జారుతోందని వచ్చిన ఘాటు వ్యాఖ్యలు హౌస్‌లో అలజడి రేపాయి. ఆ కామెంట్లు చేసింది ఆడియన్స్ కాదు… బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ నుంచి వచ్చిన మిథిలేష్, అపూర్వ, రామకృష్ణ అని తెలియడంతో అసలు కవర్ డ్రైవ్ బయటపడింది.

ఇక ఈ ముగ్గురూ బిగ్ బాస్ గేటు వద్ద ప్రత్యక్షమై హౌస్‌మేట్స్‌తో నేరుగా తలపడ్డారు. ముఖ్యంగా మిథిలేష్-త్రిగుణ్‌ల మధ్య తెలుగు భాషా నైపుణ్యంపై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ మిథిలేష్, అపూర్వ, రామకృష్ణలో ఒకే ఒక్కరికి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అర్హత ఉందని, ఆ ఒక్కరిని ఎంచుకునే తుది నిర్ణయాధికారాన్నిహౌస్‌మేట్స్‌కే అప్పగించారు  బిగ్ బాస్ .

దీంతో తమకు సెట్ అయ్యే వ్యూహకర్త ఎవరు? పోటీనిచ్చే బలమైన కంటెస్టెంట్ ఎవరు? అని లెక్కలు వేసుకుంటూ సభ్యులు తమ ఓట్లను బాక్స్‌లో వేశారు. ఈ ముగ్గురిలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి హౌస్‌లో సరికొత్త రచ్చ స్టార్ట్ చేసే ఆ ఒక్కరూ ఎవరో శుక్రవారం ( సెప్టెంబర్ 25, 2026 ) ఎపిసోడ్‌లో తేలనుంది..

 

©️ VIL Media Pvt Ltd.