
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు అంతా సిద్ధమైంది. కాసేపట్లో టస్కర్‌పైకి ఖైరతాబాద్ పంచముఖ మహా గణపతిని సెట్ చేయనున్నారు. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు శోభాయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సాగర్ తీరానికి బడా గణేష్ చేరుకోనున్నాడు.. మహాగణపతి నిమజ్జనానికి క్రేన్ నంబర్-4 సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలలోపు నిమజ్జనం పూర్తి కానుంది. శోభాయాత్ర మార్గంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో ఖైరతాబాద్ గణేషుడు.. భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఇవాళ్టి నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్యాంక్ బండ్ సహా.. ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ట్యాంక్‌బండ్‌కు విగ్రహాలను తరలించే వాహనాలకు మాత్రమే ప్రధాన ఊరేగింపు మార్గంలో అనుమతి ఉంటుందన్నారు పోలీసు అధికారులు.
ఖైరతాబాద్ ఫ్లైఓవర్, NTR మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు ఖైరతాబాద్, తెలుగుతల్లి, లిబర్టీ, MJ మార్కెట్, GPO వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.