
సైబర్ క్రైం.. టెక్నాలజీ అభివృద్ది చెందుతున్న కొద్దీ ఈ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని రకరకాల మోసాలకుపాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు రోజు రో జుకు పెరుగుతున్న విషయం మనందరికి తెలుసు. అయితే ఈజీ మనీ కోసం సైబర్ క్రైం నుం ఓ వ్యసనం మార్చుకున్న వాళ్లు లేకపోలేదు.. సైబర్ క్రైం డేటా ఇదే చెబుతోంది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఇదే స్పష్టం చేసింది. జార్ఖండ్ లో జరిగిన ఓ సైబర్ క్రైం కేసులో ఓ నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ (ఈజీ మనీ) చాలా మంది, ముఖ్యంగా యువతను సైబర్ నేరాల (Cyber Crime) వైపు నెడుతోంది. క్షణాల్లో లక్షలు సంపాదించవచ్చనే భ్రమతో ఓ ప్రమాదకర వ్యసనంగా మారుతోంది.కష్టపడకుండా, తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే దురాశతో ఆన్‌లైన్ రమ్మీ, క్రికెట్ బెట్టింగ్ వంటి యాప్‌లలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించడానికి క్రైమ్స్ వైపు మళ్లుతున్నారు. చదువుకున్నా ఉద్యోగం లేకపోవడం లేదా స్నేహితులతో విలాసవంతంగా జీవించాలనే కోరిక తో ఇంటర్నెట్, డార్క్ వెబ్, వివిధ రకాల హ్యాకింగ్ టూల్స్, టెలిగ్రామ్ ఛానెల్స్ ద్వారా సులభంగా మోసాలకు పాల్పడుతున్నారు. పార్ట్ టైమ్ జాబ్ స్కామ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, లోన్ యాప్స్ వేధింపులు, మ్యూల్ అకౌంట్స్ ద్వారా సైబర్ ఫ్రాడ్ లకు పాల్పడుతున్నారు.
ఈజీమనీ కోసం కొందరికి సైబర్ క్రైం ఓ వ్యవసనంగా మారిందని సుప్రీంకోర్టు బుధవారం (సెప్టెంబర్ 23) కీలక వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరం ఒక వ్యసనం లాంటిదని సైబర్ నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ కేసులో విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన స్పెషల్ లీవ్ అప్లికేషన్ (SLP)పై విచారణ జరుపుతున్నప్పుడు, జస్టిస్ జెబి పర్దివాలా మరియు జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
సైబర్ క్రైమ్స్ కింద దొరికిపోతే ఐటీ చట్టం (IT Act) ప్రకారం బెయిల్ దొరకడం కష్టం, భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అర్హత కోల్పోతారు.సైబర్ నేరాల వలలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకున్న వారు, లేదా నేరాల్లో ఇరుక్కున్న వారు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరాలపై పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. కష్టపడకుండా డబ్బు వస్తుంది అనే ఏ ఆఫర్ అయినా 100శాతం మోసమే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వాట్సాప్, టెలిగ్రామ్‌లలో వచ్చే తెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు వంటి క్రిడెన్షియల్ సమాచారం ఎవరికీ షేర్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే భారత ప్రభుత్వ అధికారిక సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయవచ్చు లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.