Reading Time: < 1 minute
Hair Mistakes: తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్‌ అవుతుంది!

Lifestyle: తరచుగా జట్టు వాష్‌ చేయడం మంచిది. కాదు. రోజూ లేదా అవసరానికి మించి తలస్నానం చేయడం వల్ల సహజ నూనెలలు తొలగిపోతాయి. దీంతో జుట్టు పొడిబారడం, ఫ్రిజ్‌, విరిగిపోవడం వంటి సమస్యలు రావచ్చు. మీ జుట్టు స్వభావానికి సరిపోని షాంపూను ఉపయోగిస్తే జుట్టు పొడిగా , రఫ్‌గా మార్చవచ్చు. డ్రై లేదా డ్యామెజ్డ్‌ హెయిర్‌కు తేమను అందించే షాంపూలను ఎంచుకోవడం మంచిది.

నూనె, చెమట, కాలుష్యం, హెయిర్ ప్రోడక్ట్స్‌ అవశేషాలు స్కాల్ప్‌పై పేరుకుపోవచ్చు. అవసరాన్ని బట్టి మైల్డ్‌ ప్రీ-వాష్‌ ట్రీట్‌మెంట్‌ లేదా స్కాల్ప్‌ క్లెన్సింగ్‌ ఉపయోగపడుతుంది. జుట్టుపై షాంపూ లేదా కండీషనర్‌ అవశేషాలు మిగిలితే జుట్టు జిడ్డుగా, బరువుగా అనిపించవచ్చు. అందుకే నీటితో పూర్తిగా కడిగేయాలి. తడిగా ఉన్న జుట్టును గట్టిగా దువ్వకండి. తడిగా ఉన్నప్పుడు జుట్టు మరింత బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో బలంగా దువ్వడం లేదా లాగడం వల్ల జుట్టు విగిరిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

స్ర్టైయిటెనర్లు, కర్లర్లు, బ్లో డ్రైయర్లను అధికంగా ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారి బలహీనంగా మారవచ్చు. వీటిని పరిమితంగా అవసరమైతే హీట్‌ ప్రొటెక్టెంట్‌ వాడటం మంచిదంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి