
బిగ్‌బాస్ సీజన్ 10 గ్రాండ్ లాంఛింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 6న) సాయంత్రం 7 గంటలకు ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే సర్దార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా కార్తీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు చీఫ్ గెస్టుగా రానున్నాడు. మరోవైపు ఈసారి కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అగ్ని పరీక్ష సీజన్ 2 లో సత్తా చాటిన సింగర్ ఝాన్సీ హౌస్ కంటెంటర్ గా ఎంట్రీ కన్ఫార్మ్ అయ్యింది. ఆమెతో పాటు మరో నలుగురు లేదే ఐదుగురు కామనర్స్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా రానున్నట్లు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త కమెడియన్లు, యూట్యూబర్ల పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిలో జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ విషయంపై గత కొద్దికాలంగా స్వయంగా అతనే వరుసగా హింట్స్ ఇస్తూ వస్త్ఉన్నాడు. ఇటీవలే కొత్తగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆటో రామ్ ప్రసాద్ బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడనే విషయం దాదాపు కన్ఫామ్ అయిపోయింది. తాజాగా ఈ విషయంపై మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చాడీ జబర్దస్త్ కమెడియన్. బిగ్ బాస్ లోకి వెళ్లే ముందే తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు రామ్ ప్రసాద్. అనంతరం తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
‘జబర్దస్త్ నుంచి ఇప్పటివరకు నా కామెడీని ఎంజాయ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జబర్దస్త్ జర్నీ నాకు చాలా స్పెషల్. మీ ప్రేమ సపోర్ట్ కారణంగానే నేను ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను… ఇప్పుడు నా జీవితంలో మరొక కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతోంది. ఈ జర్నీలో కూడా మీ సపోర్ట్ ఇలాగే నా ఉండాలని కోరుకుంటున్నాను. ఛేంజ్ ఏదైనా మీకోసం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం పక్కా’ అని రాసుకొచ్చాడు ఆటో రామ్ ప్రసాద్ . తద్వారా బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నానంటూ ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చేశాడు. కాగా బిగ్ బాస్ అగ్రిమెంట్ ప్రకారం.. హౌస్‌లోకి వెళ్లేవరకు అధికారికంగా ఏ విషయం చెప్పకూడదు.అందుకే రాంప్రసాద్ ఎక్కడా బిగ్ బాస్ అని పేరు చెప్పకుండా ఇలా ఇన్ డైరెక్టుగా తన ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి రామ్ ప్రసాద్ హింట్ తో బిగ్ బాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ కు కొదవ ఉండదంటున్నారు.
ఆటో రామ్ ప్రసాద్ పోస్ట్..
#Jabardasth nunchi ippati varaku naa comedy ni enjoy chesi, nannu support chesina prathi okkariki heartfelt THANK YOU
Aa journey naaku chala special… mee love & support valle ee roju nenu ee stage lo unna!
Ippudu life lo oka new chapter start avvabothundi… ee journey lo… pic.twitter.com/gwOp7wLQmZ
— Jabardasth Ram Prasad (@RamPrasadAuto) September 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

