Reading Time: 2 minutes

బ్యాట్‌తోనే కాదు.. డ్యాన్స్‌తోనూ దుమ్మురేపిన సూర్య భాయ్.. నెట్టింట వీడియో వైరల్! 

Caption of Image.

Suryakumar Yadav: మహారాష్ట్రలోని థానేలో జరిగిన జన్మాష్టమి దహి హండీ సంబరాల్లో భారత నయా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సాంప్రదాయ దుస్తుల్లో వేసిన ఊరమాస్ డాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2026 తర్వాత జరిగిన టీ20 ముంబై లీగ్‌లో ట్రయంఫ్ నైట్స్ తరఫున ఆడి 163 పరుగులు చేసిన సూర్య, ఆ తర్వాత నుంచి పోటీ క్రికెట్‌కు కాస్త దూరంగా ఉంటున్నాడు. టీమిండియాకు టీ20 ప్రపంచకప్ 2026 అందించి కెప్టెన్‌గా తిరుగులేని విజయం సాధించినప్పటికీ, అతడిని సడన్‌గా జట్టు నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

నా పేరు లేకపోవడంతో షాక్ అయ్యా.. సూర్య ఆవేదన: 

తనను అనూహ్యంగా టీ20 జట్టు నుంచి తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ తాజాగా ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. జట్టు ప్రకటనలో నా పేరు లేకపోవడం చూసి ముందు నవ్వొచ్చింది.. జీవితంలో నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేను నవ్వుతూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను.. 2026లో ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.. ఒలింపిక్స్, అలాగే మరొక టీ20 ప్రపంచకప్ వరకు జట్టును ముందుండి నడిపిస్తానని భావించాను అని సూర్య భాయ్ తన ఆవేదనను బయటపెట్టాడు.

అన్నీ బాగున్నప్పుడు ఎందుకు చేంజ్ చేశారు: 

వరల్డ్ కప్ గెలిచిన జట్టులో మార్పులు ఎందుకు చేశారో అర్థం కాలేదని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా మేము ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు, ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ గెలిచాం.. ప్రతిదీ అద్భుతంగా సాగుతున్నప్పుడు ఈ సడన్ చేంజ్ ఎందుకు చేశారో అర్థం కాక తీవ్ర నిరాశకు గురయ్యాను.. కానీ నా స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. అతడు అద్భుతమైన ప్లేయర్, మంచి మనిషి, గొప్ప కెప్టెన్.. నాకేమీ అతనిపై కోపం లేదు, కానీ బోర్డు నిర్ణయం మాత్రం నన్ను ఆశ్చర్యపరిచిందన్నాడు. 

►ALSOL READ | టీమిండియా ఫుల్ బిజీ.. 17 రోజుల్లో 4 సిరీస్‌లు.. షెడ్యూల్ చూస్తే షాకే!

మళ్లీ కంబ్యాక్ ఇచ్చేనా? ఫ్యాన్స్ ఆశలు: 

ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తుండగా, 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌నే పక్కన పెట్టడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దహి హండీ వేడుకల్లో సూర్య ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ సందడి చేయడం చూసిన అభిమానులు, అతడు ఈ చేదు జ్ఞాపకాన్ని మరిచిపోయి త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.