అస్సలు పొయ్యి ముట్టించకుండా పచ్చి కొబ్బరి పాల పాయసం ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు. పండుగలప్పుడు ఎంతో మంది చేసుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
పచ్చి కొబ్బరి పాయసానికి కావలసిన పదార్థాలు : ఒక లేత కొబ్బరికాయ నీరు, రెండు లేత కొబ్బరి గుజ్జు, 150 గ్రాముల తాటి బెల్లం లేదంటే కొబ్బరి బెల్లం , 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు తురిమిన పచ్చి కొబ్బరి గోరువెచ్చని నీరు తీసుకోవాలి. దీన్ని సరైన కొలతలతో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి
పచ్చి కొబ్బరి పాయసం తయారీ విధానం : ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత దీనిలో గోరువెచ్చని నీరు పోసి 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఈ నీరు తీసుకోవడం వలన వల్ల కొబ్బరి నుంచి పాలు ఈజీగా వస్తాయి. ఇప్పుడు మిక్సీని ఆన్ చేసి మెత్తగా, క్రీమీగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి.
పచ్చి కొబ్బరి పాయసం తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు ఒక మెత్తని క్లాత్ తీసుకుని, దీనిని వేసి ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇంకా మీ చేతులతో దీనిని బాగా పిండుతూ చిక్కటి కొబ్బరి పాలను వేరు చేయాలి. ఈ కొబ్బరి పిప్పిని మిక్సీలో వేసి ఇంకోసారి వడకట్టి పాలను తియ్యాలి అంతే, పచ్చి కొబ్బరి పాలు రెడీ.
పచ్చి కొబ్బరి పాయసం తయారీ విధానం స్టెప్ 2 : ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్, కొబ్బరి పాలు, బెల్లం వేసి ఇది మొత్తం పూర్తిగా కరిగిన తరవాత బాగా కలుపుకోవాలి. చివర్లో కట్ చేసి పెట్టుకున్న లేత కొబ్బరి ముక్కలను వేసి కలుపుకోవాలి.
ఇలా చేస్తే దీని కోసం పొయ్యి వెలిగించాల్సిన అవసరమే లేదు.




