Reading Time: < 1 minute

బీఈ/బీటెక్, పీజీ అర్హతతో DRDOలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇవే!

Caption of Image.

డీఆర్​డీఓకు చెందిన నేవల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ ల్యాబొరేటరీ (ఎన్​పీఓఎల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్  విడుదల చేసింది.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: అక్టోబర్ 10. 

సెలెక్షన్ ప్రాసెస్: వాక్​ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్     www.drdo.gov.inను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.