Reading Time: < 1 minute

SBIలో ఉద్యోగావకాశం ! డిగ్రీ అర్హతతో 35 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!

Caption of Image.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ (ఐబీజీ) విభాగంలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ – ఐబీజీ (టీఎఫ్ఓ– ఐబీజీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ కింద మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లయ్  చేసుకోవచ్చు.

పోస్టు పేరు: ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ జేఎంజీఎస్–-I & ఎంఎంజీఎస్–-II.

మొత్తం ఖాళీలు: 35. 

విభాగాల వారీగా ఖాళీలు: ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ – ఐబీజీ (టీఎఫ్ఓ – ఐబీజీ) జేఎంజీఎస్–-I – 14, ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ – ఐబీజీ (టీఎఫ్ఓ –- ఐబీజీ) ఎంఎంజీఎస్-–-I- 21.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 
ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) నుంచి ఫారెక్స్ ఆపరేషన్స్​లో సర్టిఫికెషన్ కలిగి ఉండాలి. 
ఎల్ఐబీఎఫ్ జారీ చేసిన సర్టిఫికెట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్స్ (సీడీసీఎస్) లేదా సర్టిఫికెట్ ఫర్ 
స్పెషలిస్ట్స్ ఇన్ డిమాండ్ గ్యారంటీస్ (సీఎస్​డీజీ) లేదా ఐసీసీ అకాడమీ అందించే సర్టిఫైడ్ ట్రేడ్ ఫైనాన్స్ 
ప్రొఫెషనల్ (సీటీఎఫ్​పీ) కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఉద్యోగ అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: టీఎఫ్ఓ – ఐబీజీ, జేఎంజీఎస్–-I పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
టీఎఫ్ఓ–- ఐబీజీ, ఎంఎంజీఎస్–I పోస్టులకు 23 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 29. 

అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలు రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు ఫీజు ఉండదు. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 19.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ sbi.bank.inను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.