Gold, Silver Prices: బంగారం, వెండి ధరల తగ్గింపు పర్వం కొనసాగుతోంది. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. దీంతో మహిళలకు భారీ ఊటర కలిగిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తగ్గింపు దోరణి ఇలాగే కొనసాగితే బాగుండని కోరుతున్నారు. ప్రస్తుతం సెస్టెంబర్ 2న భారీగా తగ్గింది. తులం బంగారంపై ఏకంగా 2,070 రూపాయలు తగ్గింది. వెండిపై 5 వేల రూపాయలు తగ్గింది.
సెప్టెంబర్ ఆరంభంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఆభరణాల వ్యాపారుల ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,020గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,350 వద్ద ట్రేడవుతోంది.
అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ఆగస్ట్ 24న 1,63,970 ఉండగా, ప్రస్తుతం 1,52,020 వద్ద కొనసాగుతోంది. అలాగే మొత్తంగా 11,950 వరకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,400గా ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి 10 గ్రాములకు అది రూ.1,39,350కు పడిపోయింది. అలాగే18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,22,930 నుండి రూ.1,14,020కి పడిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,14,020 గా నమోదైంది.
వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఆగస్టు 24న గ్రాము వెండి ధర రూ.260 ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి అది గ్రాముకు రూ.245కు పడిపోయింది. అంటే, సుమారు వారం రోజుల్లో వెండి ధర గ్రాముకు రూ.15 మేర తగ్గిందని అర్థం. అంటే ఈ కాలంలో కిలోపై ఏకంగా 15 వేల రూపాలయ వరకు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ, మార్కెట్లో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉంది.




