Reading Time: < 1 minute

రవితేజ వారసుడు మాధవ్ ‘మారెమ్మ’ ట్రైలర్ రిలీజ్.. పక్కా మాస్ విలేజ్ యాక్షన్ డ్రామాతో గూస్‌బంప్స్!

Caption of Image.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇంటి నుంచి మరో వారసుడు సిద్ధమయ్యాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. ఇప్పటికే టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  విడుదలైన ఈ ట్రైలర్‌తో సినీ ప్రియుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

తెలంగాణ పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఊరి గ్రామదేవత ‘మారెమ్మ తల్లి’ నమ్మకాలు, భక్తితో పాటు రా రస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఊరిని ఆపదల నుంచి కాపాడే మారెమ్మ తల్లికి ప్రతిరూపంగా భావించే ఒక పవిత్రమైన దున్నపోతు అనుమానాస్పదంగా మాయమవ్వడమే ఈ సినిమా అసలు కథ. అది మాయమవ్వడంతో ఊరిపై అరిష్టాలు విరుచుకుపడతాయి.

దీంతో ఆ పవిత్ర జీవిని వెతికి పట్టుకునే బాధ్యతను హీరో ( మాధవ్ భూపతిరాజు ) తన భుజాన వేసుకుంటాడు. ఆ శోధనలో అతనికి ఎదురైన రక్తసిక్తమైన సవాళ్లు, స్థానిక ముఠాల పగ, ఊరి మూఢనమ్మకాలు ఏంటనేది ట్రైలర్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించారు. మాధవ్ ఈ చిత్రంలో ఊరమాస్ లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుండగా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రాణంగా నిలిచింది. 

►ALSO READ | రష్మిక ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 42 రోజుల్లోనే రెండు బిగ్ రిలీజెస్.. ‘మైసా’ విడుదల ఎప్పుడంటే?

ఇందులో మాధవ్ భూపతిరాజు సరసన దీపా బాలు కథానాయికగా అలరించనుంది. వికాస్ వాసిష్ట, వినోద్ కుమార్, వి.ఎస్. రూపాలక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మంచాల నాగరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఇప్పటికే ‘ఇరుముడి’ విజయంతో రవితేజ జోరు మీద ఉన్నారు. మరి తమ్ముడు కూమారుడు మాధవ్ కు హీరోగా  సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ పక్కా మాస్ విలేజ్ థ్రిల్లర్  ఎలాంటి టర్నింగ్ పాయింట్ కానుందో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.