Reading Time: < 1 minute
Rashmika Mandannas Mysaa Release Date Fixed Hits Screens Worldwide On November 27 2026

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై ‘మైసా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది.  హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన  అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత.

పాన్ ఇండియా భాషలలో తెరకెక్కతున్న ఈ సినిమా గ్లిమ్స్ కు అప్పట్లో మంచి స్పందన లభించింది. ఇటీవల రష్మికకు గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం గాయం నుండి కోలుకున్న రష్మిక త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టనుంది. రష్మిక సెట్స్ లో జాయిన్ అయ్యాక జెట్ స్పీడ్ లో షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 2026 నవంబర్ 27న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రష్మిక నటన, గ్లామర్ మరియు ఆమె పాత్రలోని వైవిధ్యం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.