
ఈ ఏడాది(2026) ఆగస్టు నెల ముగిసి.. సెప్టెబర్ ప్రారంభమయింది. ఈ నెలలో అనేక గ్రహాలు కదులుతున్నాయి. దీంతో కొన్ని రాజయోగాలు ఏర్పడుతాయి. దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అయితే జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం .. 2026 సెప్టెంబర్ లో వృషభరాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
సెప్టెంబర్ అనేక గ్రహాలు వాటి స్థానాలు మారుతున్నాయి.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబర్ లో స్థానాలు మారుతున్న గ్రహాలు
- సెప్టెంబర్ 2: తులా రాశిలోకి శుక్రుడు
- సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు
- సెప్టెంబర్ 17: కన్యారాశిలోకి సూర్యుడు
- సెప్టెంబర్ 18: కర్కాటక రాశిలోకి కుజుడు
- సెప్టెంబర్ 26: తులా రాశిలోకి బుధుడు
సెప్టెంబర్ 2026 లో కీలక గ్రహాలు స్థానాలు మారడంతో వృషభ రాశి వారికి అన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. కెరీర్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే పురోగతి ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో కొద్ది పాటి ఇబ్బందులు వస్తాయి. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
సెప్టెంబర్ నెల మధ్య నుంచి ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయం కలిగే అవకాశం ఉంది. ఆఫీసులో కీలక బాధ్యతలు పోషిస్తారు. ఆస్తి వివాదాలు పెద్దల పంచాయితీతో పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు ఆఫర్ లెటర్ అందుకొనే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడంతో పాటు అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి.
శుక్ర, శని గ్రహాల శుభ ప్రభావం ప్రేమ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. వైవాహిక జీవితంలో, పరస్పర సహకారం మీ బంధాన్ని బలపరుస్తుంది. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి.ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం, సంతోషం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త వ్యూహాలను రచిస్తారు.
పరిహారం: నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.. ప్రతి మంగళవారం హనుమంతుడికి వడమాల సమర్పించండి.. శని వారం పేదలకు అన్నదానం చేయండి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.