Reading Time: < 1 minute
Irumudi 10 Days Box Office Collections 180 Crores Gross Ravi Teja

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజులు గడుస్తున్నా రవన్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. మేకర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ఏంటో ఇట్టే అర్థమవుతుంది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 180 కోట్లకు పైగా గ్రాస్ (180 CR+) వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. రవితేజ కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఇది ఒక మైల్ స్టోన్ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ తాజా పోస్టర్‌లో తోటి స్వాములతో కలిసి నల్లటి వస్త్రాలు, మెడలో మాలలు ధరించి, ఒంటికాలిపై నిలబడి భక్తిపారవశ్యంతో రవితేజ ఇచ్చిన ఫోజు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

ఆయనలోని మాస్ అప్పీల్‌కు ఆధ్యాత్మికతను జోడించి తీసిన ఈ చిత్రం థియేటర్లలో ‘హార్ట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్’గా దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఎక్కడా రాజీ పడకుండా పెట్టిన నిర్మాణ వ్యయం స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇదే ఊపు కొనసాగితే ‘ఇరుముడి’ అతి త్వరలోనే 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.