
కాల గమనంలో మరో నెల ఈ రోజుతో ( ఆగస్టు 31)ముగిసింది.రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. 2026 సెప్టెంబర్లో చాలా పవిత్రమైన రోజులున్నాయి. కృష్ణాష్టమి.. వినాయక చవితి.. వంటి పండుగలతో పాటు పితృపక్షాలు కూడా ఇదే నెలలో ప్రారంభం కానున్నాయి. 2026 సెప్టెంబర్ లో పండుగలు.. విశేషమైన రోజులు.. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. . .!
- సెప్టెంబర్ 1: సంకష్టహర చుతుర్థి, శ్రావణ మంగళగౌరీ వ్రతం
- సెప్టెంబర్ 2: శ్రీకృష్ణుని సోదరుడు బలరాముని జయంతి ( హల షష్ఠి)
- సెప్టెంబర్ 3: శీతల దేవి పండుగ
- సెప్టెంబర్ 4: కృష్ణ జన్మాష్టమి, వింధ్యవాసిని జయంతి, కాలాష్టమి
- సెప్టెంబర్ 5: ఉపాధ్యాయుల దినోత్సవం, దహీ హండి , ఉట్లోత్సవం( ఉట్టి కొట్టడం)
- సెప్టెంబర్ 7: అజ ఏకాదశి
- సెప్టెంబరు 8: భౌమ ప్రదోష వ్రతం
- సెప్టెంబర్ 9: మాస శివరాత్రి
- సెప్టెంబర్ 11 : పోలాల అమావాస్య, శ్రావణ మాసం చివరి రోజు
- సెప్టెంబర్ 12: పరాభవ నామ సంవత్సరం బాధ్రపద మాసం ప్రారంభం
- సెప్టెంబర్ 13: వరాహ జయంతి (శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మూడవఅవతారం)
- సెప్టెంబర్ 14 : వినాయకచవితి , గణేష్ చతుర్థి, గౌరీ హబ్బా ( మహిళల పండుగ) , స్వర్ణ గౌరీ వ్రతం
- సెప్టెంబర్ 15: – ఋషి పంచమి ( సప్త రుషులకు పూజ.. తెలిసి తెలియక చేసిన తప్పుల నుండి, దోషాల నుండి విముక్తి), శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
- సెప్టెంబర్ 16 : స్కంధషష్ఠి
- సెప్టెంబర్ 17: విశ్వకర్మ పూజ, కన్య సంక్రాంతి
- సెప్టెంబర్ 18: దూర్వా అష్టమి ( గరికతో వినాయకుడికి పూజ)
- సెప్టెంబర్ 19: రాధా అష్టమి (శ్రీకృష్ణుని భార్య రాధా రాణి జన్మదినం), – మాసిక దుర్గాష్టమి, మహాలక్ష్మీ వ్రతం ప్రారంభం
- సెప్టెంబర్ 22: పరివర్తని ఏకాదశి, కల్కి ద్వాదశి
- సెప్టెంబర్ 23 : ఓనం పండుగ, వామన జయంతి, భువనేశ్వరి జయంతి, శ్రీవారి పవిత్రోత్సవాలు ముగింపు
- సెప్టెంబర్ 24: గురు ప్రదోష వ్రతం
- సెప్టెంబర్ 25: గణేష్ నిమజ్జనం, అనంత చతుర్దశి వ్రతం
- సెప్టెంబర్ 26: బాధ్రపద పౌర్ణమి, ఉమామహేశ్వర వ్రతం
- సెప్టెంబర్ 27: పితృ పక్షం ప్రారంభం, ప్రతిపాద శ్రాద్ధం
- సెప్టెంబర్ 28: ఉండ్రాళ్ల తద్ది
- సెప్టెంబర్ 29: సంకష్ఠ హర చతుర్థి