Reading Time: < 1 minute
అయ్యో పాపం.. మరోసారి 90ల్లోనే.. వైభవ్ ఆ రికార్డ్‌ను మాత్రం టచ్ చేసేటోడు లేడుగా..!

Vaibhav Sooryavanshi: దులీప్‌ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. శతకానికి చేరువగా వచ్చి నిరాశపరిచాడు. 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్‌ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అర్ధశతకం సాధించిన వైభవ్‌.. సెంచరీకి కేవలం 8 పరుగుల దూరంలో పెవిలియన్‌కు చేరాడు. ఈస్ట్‌ జోన్‌ తరఫున బ్యాటింగ్‌ చేసిన వైభవ్‌ సూర్యవంశీ 81 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్‌రేట్‌ 113.58గా నమోదైంది. హర్ష్‌ దూబే వేసిన 26వ ఓవర్‌ రెండో బంతిని వైభవ్‌ భారీగా ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేవగా.. మిడ్వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న అర్షద్‌ ఖాన్‌ వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి అద్భుతంగా క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో వైభవ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

తృటిలో సెంచరీ మిస్‌..

వైభవ్‌ 92 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే సెంచరీకి మరో 8 పరుగులు అవసరమైన సమయంలో ఔటవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తున్న సమయంలో ఈస్ట్‌ జోన్‌ సహచర ఆటగాళ్లు అతడికి చప్పట్లతో అభినందనలు తెలిపారు.

ఎక్కువమంది చదివినది: Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..!

వైభవ్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇది రెండోసారి 90లలో ఔటవడం కావడం గమనార్హం.

రికార్డు మాత్రం సొంతమే..!

సెంచరీ చేజారినా వైభవ్‌ సూర్యవంశీ పేరు ఇప్పటికే దులీప్‌ ట్రోఫీ రికార్డుల్లోకి ఎక్కింది. కేవలం 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే అర్ధశతకం సాధించి ఈ టోర్నీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో 50+ స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..?

వైభవ్‌ సూర్యవంశీ – 92 (81)

ఫోర్లు – 7 | సిక్సర్లు – 4

స్ట్రైక్‌రేట్‌ – 113.58

శతకం తృటిలో చేజారినా.. వైభవ్‌ బ్యాటింగ్‌ మాత్రం మరోసారి భారత క్రికెట్‌లో ఈ యువ సంచలనం ఎందుకు ప్రత్యేకమో చాటిచెప్పింది!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..