Reading Time: 2 minutes
కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా.. నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు: సందీప్ రెడ్డి

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – డైరెక్టర్ వేణుగోపాల్ ఈ కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా. అయితే కథ చెప్పినంత బాగా సినిమా తీస్తావా అని అడిగాను. ఆయన ఒక 6 నిమిషాల నిడివి గల సీన్ తీసుకొని వచ్చి చూపించాడు. స్క్రిప్ట్ లో ఉన్న దానికంటే ఇంకా బాగా సీన్ తెరకెక్కించాడు అనిపించింది. అప్పటి నుంచి వేణుకే ఈ సినిమా బాధ్యత మొత్తం అప్పగించాను అన్నారు.

ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా

అలాగే నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. మెయిన్ లీడ్ కాబట్టి హీరో అనే ఫీల్ సహజంగానే ఉంటుంది. కానీ సుమంత్ ప్రభాస్ అలాంటిదేం కనిపించకుండా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరితో కలిసిపోయి బాగా నటించాడు. అతనిది అమాయకమైన క్యారెక్టర్. ఆ పాత్రలో బాగా నటించాడు అనిపించింది. అనంతిక పర్ ఫార్మెన్స్ రియల్లీ గుడ్. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లో నటించిన వాళ్లంతా సూపర్బ్ గా నటించారు. మ్యూజిక్ కోసం వాసుకిని తీసుకున్నప్పుడు ఒక నమ్మకంతో తీసుకున్నాం అన్నారు. పాటలు, మ్యూజిక్ విన్నప్పుడు అది నిజమైంది అనిపించింది.

అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..

సెప్టెంబర్ 3న సినిమా రిలీజ్, సెప్టెంబర్ 2నే ప్రీమియర్స్ వేస్తున్నాం. డైరెక్టర్ వేణుగోపాల్ కల నిజమయ్యే రోజు సెప్టెంబర్ 3. ఆ తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేసినా ఆ రోజు నీ జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంటుంది. నాకు, విజయ్ కు అర్జున్ రెడ్డి రిలీజైన ఆగస్టు 24 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి రోజు నీకూ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డారు. సినిమా అంతా గట్టిగా నవ్వుకుంటారు. ఈ సినిమా కోసం మీరు వెచ్చించే డబ్బు, సమయం ఏమాత్రం వృథా కాదు. మళ్లీ సినిమా చూడాలని కూడా అనుకుంటారు. అలాంటి ఫన్ సీన్స్ కూడా ఉన్నాయని  సందీప్ రెడ్డి అన్నారు.

16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్‌లు



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.