Reading Time: < 1 minute
Bhakthi Tv Anniversary Special Song 19 Years Of Spiritual Journey

Bhakthi Anniversary Special: తెలుగు లోగిళ్లలో ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టించి, భక్తి ప్రసారాల ద్వారా కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భక్తి టీవీ విజయవంతంగా 19 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని 20 వసంతంలోకి అడుగు పెట్టింది. భారత్‌లోనే నంబర్ వన్ ఆధ్యాత్మిక ఛానెల్‌గా గుర్తింపు పొందింది. సనాతన ధర్మ వైభవాన్ని, ఆధ్యాత్మిక సంపదను రెండు దశాబ్దాలుగా కోట్లాది మంది భక్తుల గడపలకు చేర్చింది. అలాంటి పవిత్రమైన భక్తి తత్వాన్ని గత 19 సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రవహింపజేస్తూ భక్తజనులను భగవత్ సన్నిధికి చేరుస్తున్న భక్తి టీవీ ప్రయాణానికి సంబంధించి ఓ పాటను మనసారా విని తరిద్దాం..