Reading Time: 2 minutes
Smart Phone Tips: ఫోన్ వర్షంలో తడిసిందా..? ఈ జాగ్రత్తలు పాటిస్తే రీపేర్‌కు ఇవ్వాల్సిన పని లేదు.. ఇంట్లో మీరే సరి చేసుకోవచ్చు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షం ఎప్పుడు పడుతుందనేది మనం అంచనా వేయలేం. మనం బయట ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం పడితే మన పాకెట్‌లోని ఫోన్ తడిచే అవకాశం ఉంటుంది. మనతో పాటు మన ఫోన్ కూడా వర్షంలో తడుస్తుంది. రంధ్రాల ద్వారా ఫోన్ లోపలికి వాటర్ వెళితే ఫోన్ చెడిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొసారి ఫోన్ రీపేర్ చేసినా తిరిగి పని చేసే అవకాశం ఉండదు. దీంతో వర్షం పడే సమయంలో ఫోన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఫోన్ పనికిరాకుండా పోయే ఛాన్స్ ఉంటుంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

వెంటనే ఛార్జింగ్ పెట్టొద్దు..

ఫోన్ తడిసినప్పుడు వెంటనే ఛార్జింగ్ పెట్టకండి. తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశముంటుంది. ఛార్జింగ్ పోర్ట్‌లోకి నీళ్లు చేరడం వల్ల ప్రమాదముంటుంది. దీంతో ఛార్జింగ్ పోర్ట్ పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే ఛార్జింగ్ పెట్టాలి. ఇక ఫోన్ నీళ్లల్లో పడి స్విచ్చాఫ్ అయినప్పుడు వెంటనే ఆన్ చేయవద్దు. పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాతనే ఆన్ చేయాలి. తడిగా ఉన్నప్పుడు ఆన్ చేయడం వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదముంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్నిసార్లు మదర్ బోర్డు కూడా దెబ్బతినవచ్చు. దీంతో వర్షంలో ఫోన్ తడిసి పాడైనప్పుడు రీపేర్‌కు ఇవ్వడమే బెటరని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హెయిర్ డ్రైయర్ వాడుతున్నారా..?

ఇక ఫోన్‌ను ఎండలో పెట్టడం, హెయిర్ డ్రైయర్ ద్వారా తడి ఆరిపోయేలా చేయడానికి ప్రయత్నించడం, ఓవెన్‌లో పెట్టడం వంటివి చేయవద్దని చెబుతున్నారు. వీటి ద్వారా వచ్చే వేడికి ఫోన్ పార్ట్స్ దెబ్బతినే ప్రమాదముంటుంది. దీనికి బదులు ఫోన్‌ను డ్రై క్లాత్‌తో తుడిసి ఫ్యాన్ కింద పెట్టడం మంచిది.  మీ ఫోన్‌కు  IP67, IP68, IP69 రేటింగ్ ఉన్నప్పటికీ.. వర్షంలో ఫోన్​ వాడకపోతేనే మంచిది. మీ ఫోన్ వాడేకొద్ది వాటర్  రెసిస్టెన్స్ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. స్వల్ప వర్షానికి మాత్రమే వాటర్ రిసిస్టెన్స్ పని చేస్తుంది. భారీ వర్షానికి ఫోన్ తడిసినప్పుడు వాటర్ రిసిస్టెన్స్ అడ్డుకోలేదు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్..

వర్షాకాలంలో మీ ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే.. జిప్ లాక్ లేదా వాటర్ ప్రూఫ్ కవర్లు ఉపయోగించండి. క్వాలిటీతో కూడుకున్న మొబైల్ కవర్, జిప్ లాక్ బ్యాగ్‌ను వాడండి. వీటిని మీ వద్దనే ఉంచుకోండి. బయటకు వెళ్లేటప్పుడు మీ మొబైల్‌ను వీటిల్లో పెట్టుకుని వాడండి. ఇక వాటర్​ప్రూఫ్ ఫోన్​ పౌచ్​లనే వాడండి. మీ మొబైల్‌లోని డేటాను గూగుల్ డ్రైవ్ లేదా క్లౌడ్ ఫ్లాట్‌ఫామ్స్‌కి బ్యాకప్ పెట్టుకోండి. ఒకవేళ వర్షంలో తడిచి మీ ఫోన్ పని చేయకపోతే మీ డేటా సురక్షితంగా ఉంటుంది.