Reading Time: < 1 minute

‘ముగ్గురు కోతులు’ ఎనర్జిటిక్ టైటిల్ సాంగ్ రిలీజ్.. యూత్‌ఫుల్ ఫన్ రైడ్‌తో రచ్చ లేపుతున్న యంగ్ హీరోలు!

Caption of Image.

టాలీవుడ్‌లో కొత్త ప్రయత్నాలతో, సరికొత్త యంగ్‌ టీమ్‌తో రూపుదిద్దుకుంటున్న చిత్రాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. అదే బాటలో జిఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ముగ్గురు కోతులు’. శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కార్తీక్ గరిమెల్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ హీరోలుగా నటిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా అలరించనుంది.  ఇటీవల గాంధీజీ మూడు సూత్రాల కాన్సెప్ట్‌తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంది.  ఇక లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఫుల్ ఎనర్జిటిక్ ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ యూత్‌ఫుల్ నంబర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

సముగ్గురు కోతులు..స అంటూ సాగే ఈ పెపీ అండ్ ఎనర్జిటిక్ ట్రాక్ సింగిల్ లైఫ్, బ్యాచిలర్ లైఫ్‌లోని మజాను, అల్లరిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. హీరోల రచ్చ, క్యాచీ ట్యూన్స్ యూత్‌ను ఇన్స్టంట్‌గా ఆకట్టుకుంటున్నాయి. సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ అందించిన స్వరాలకు, జగదీష్ బుసయవలస అందించిన లిరిక్స్, చైతన్య గన్నవరపు పాడిన హై-ఎనర్జీ వాయిస్ సూపర్ అసెట్‌గా నిలిచాయి. స్క్రీన్ పై హీరోలు చేసే హంగామా థియేటర్లలో ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ ఫన్ గ్యారెంటీ ఇస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకుందని, అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రాజ్ నోముల ఫొటోగ్రఫీ, జమీర్ షేక్ ఎడిటింగ్ ఈ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చనున్నాయి. త్వరలోనే ఈ ముగ్గురు కోతుల సందడికి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ డేట్స్‌ను ప్రకటించనున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ ఫ్రెష్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను నవ్వుల విందులో ముంచెత్తడం ఖాయంగా కనిపిస్తోంది..

 

©️ VIL Media Pvt Ltd.