
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వృత్తిగత, వ్యక్తిగత జీవితాల గురించి, ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తనకున్న గాఢమైన అనుబంధం గురించి వివరించారు. జెట్ ల్యాగ్‌తో యూఎస్, ఇండియా మధ్య ప్రయాణాలు మామూలేనని, తన జీవితంలో అది ఒక భాగమని పేర్కొన్నారు. కుటుంబంతో ఉండటాన్ని ఇష్టపడతానని, యూఎస్ లో ఉన్నప్పుడు కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతానని తెలిపారు. విజయవాడకు వెళ్ళడం తనకు సొంతూరు వెళ్లిన అనుభూతిని ఇస్తుందని, అక్కడ రాజుగారి తోట బిర్యానీ చాలా ఇష్టమని పంచుకున్నారు. యూఎస్ లో లాంగ్ వీకెండ్‌లలో ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ స్టేషన్స్ లేకపోవడం గమనించి, విజయవాడ వద్ద అలాంటి ఒక మంచి రెస్టారెంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని, దాని కోసం ఏడేళ్లు ఎదురుచూసి ప్రారంభించామని తెలిపారు.
ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే
చిత్ర పరిశ్రమలో తన బెస్ట్ బడ్డీల గురించి మాట్లాడుతూ, మహేష్ బాబు తనకు చాలా దగ్గరని, తన కెరీర్ ఆరంభం నుంచీ ఆయనతో కలిసి పని చేశానని చెప్పారు. తమ కుటుంబానికి మహేష్ బాబు చాలా క్లోజ్ అని, ఆయనతో తమ మధ్య “నో ఫిల్టర్” టాక్స్ ఉంటాయని, సినిమా గురించి ఎక్కువగా చర్చించమని అనిల్ సుంకర తెలిపారు. మహేష్ బాబుతో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతామని, ఆయన జోకులు వేస్తూ, మాట్లాడే తీరుతో తాము నవ్వుతూనే ఉంటామని అన్నారు. మహేష్ బాబు చాలా సపోర్టివ్‌గా ఉంటారని, తన సినిమా ఫ్లాప్ అయినా సరే, ఆయన ముందుగా కాల్ చేసి ధైర్యం చెబుతారని అనిల్ సుంకర గుర్తుచేసుకున్నారు. మహేష్ బాబు యూఎస్ వచ్చినప్పుడు, ముఖ్యంగా గౌతమ్ అక్కడ చదువుతున్నందున, తామంతా కలుసుకుంటామని తెలిపారు.
ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
సినిమా పరిశ్రమలో ఒక ఫ్లాప్ తర్వాత దర్శకులకు, నటీనటులకు అవకాశాలు ఎందుకు తగ్గుతాయనే ప్రశ్నకు, “ప్రతిదీ డిమాండ్ అండ్ సప్లైపై ఆధారపడి ఉంటుంది” అని అనిల్ సుంకర సమాధానమిచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు వంటి హిట్ చిత్రం తర్వాత కూడా, ఆగడు వంటి చిత్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే ఒక పెద్ద దర్శకుడికి ఒక ఫ్లాప్ వచ్చినా మళ్ళీ అవకాశాలు వస్తాయని, అది కేవలం సమయం కోసమేనని అన్నారు. ఒకప్పుడు చేసేద్దాం అనుకునేవారని, కానీ ఇప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తారని చెప్పారు.
10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.