మేష రాశి : ప్రేమ , సంబంధాలలో మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు భాగస్వామితో తమ భావాలను పంచుకోవడమే కాకుండా, కొత్త బంధాన్ని ఏర్పరుచుకుంటారు. ఇక ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో చాల ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. ఇక ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడుతుంది. అంతే కాకుండా ఈ రాశిలోని కొందరు ప్రేమలో పడే ఛాన్స్ ఉన్నదంట.
మిథున రాశి : మిథున రాశి వారి ప్రేమ జీవితం చాలా అందం, ఆహ్లాదకరంగా ఉంటుంది. వీరు గతంలోని చేదు అనుభవాల నుంచి బయటకు వచ్చి, చాలా సంతోషంగా గడుపుతారు. అంతే కాకుండా ఈ రాశి వారు తమ మనసులోని భావాలను వ్యక్తపరచడంలో ముందు ఉంటారు. అంతే కాకుండా భాగస్వామితో ప్రతి విషయాన్ని పంచుకొని మనసులోని భారాలను దించుకొని ఆనందంగా ఉంటారు. ఇక ఈ రాశిలో ఒంటరిగా ఉన్నవారు, కొత్త వ్యక్తులను కలిసి వారితో ప్రేమలో పడటం జరుగుతుందంట.
సింహ రాశి : సింహ రాశి వారి ప్రేమలో అపారమైన శక్తి దాగుంది. వీరు చాలా అద్భుతమైన జీవితానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వీరి మనసులోని ప్రేమే వీరి జీవితంలో కొత్త వెలుగులను తీసుకొస్తుంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు కోరుకున్న కలల రాణి లేదా రాజు తమ జీవితంలోకి వచ్చే ఛాన్స్ ఉందంట.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు తమ ప్రేమను వ్యక్త పరచడంలో ముందు ఉంటారు. అంతే కాకుండా వీరి ప్రేమ సంబంధాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వీరి భావాలు కూడా నిజాయితీగా ఉంటాయి. ఇదే వీరిని మరో మెట్టు ఎక్కిస్తుంది. భాగస్వామితో బంధాన్ని మరింత పెంచుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారు కొందరు, ఈ నెలలో ప్రేమలో పడే ఛాన్స్ ఉన్నదంట.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




