Reading Time: 2 minutes
Shukra Gochar: శుక్ర కటాక్షం..ఈ రాశులకు చెందిన మహిళలకు అదృష్టం, ఆర్థిక పురోగతి!

మహిళా పక్షపాతి అయిన శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నా, స్వస్థానంలో ఉన్నా తప్పకుండా మహిళలను వృద్ధిలోకి తీసుకు వస్తాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. సెప్టెంబర్ 3 నుంచి జనవరి 1 వరకు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి వల్ల కొన్ని రాశులకు చెందిన స్త్రీలు అత్యధికంగా లబ్ధి పొందబోతున్నారు. శుక్రుడు ఒక రాశిలో వంద రోజులకు పైగా సంచారం చేయడమన్నది ఎంతో అరుదైన విషయం. దీని ఫలితంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల మహిళలకు వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు, ఆదాయ వృద్ధి అదృష్టాల పట్టబోతున్నాయి. గృహిణులు సైతం ఆర్థికంగా పురోగతి చెందడం జరుగుతుంది.

మేషం

ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు స్వస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలుగుతుంది. దీనివల్ల మహిళలకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధన యోగాలు కలుగుతాయి. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉన్నత కుటుం బంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఉద్యోగినులు ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు.

మిథునం

ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశికి చెందిన మహిళలకు వృత్తి, ఉద్యోగాల్లో అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపుగా ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. వీరికి కలలో కూడా ఊహించని ఆదాయ లాభం కూడా కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. షేర్లు, స్పెక్యు లేషన్లు లాభిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తి పాస్తులు లభించే అవకాశం ఉంది.

కర్కాటకం

ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్రుడి స్వస్థాన ప్రవేశం వల్ల ఈ రాశి స్త్రీలు ఆర్థికంగా బాగా బలపడే అవకాశం ఉంది. ఆస్తి లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రాబల్యం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అత్యధికంగా లాభాలు కలుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. తల్లి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. దాంపత్య జీవితం బాగా సుఖమయం అవుతుంది.

కన్య

ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్ర గ్రహం ధన స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఈ రాశి మహిళల జీవితాల్లో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. మనసులోని కోరికలు నెర వేరుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వారసత్వ ఆస్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

తుల

రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశి మహిళలకు ఆధిపత్యం లభించడం, అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి. మాలవ్య మహా పురుష యోగం పట్టడం వల్ల ఒక ప్రముఖురాలిగా గుర్తింపు లభిస్తుంది. సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు లోటుండదు. దశ, దిశ పూర్తిగా మారిపోతాయి. ధన యోగాలు, రాజయోగాలు కలుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురు తుంది.

ధనుస్సు

ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశికి చెందిన మహిళలకు ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లుబాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా కనీవినీ ఎరుగని పురోగతి ఉంటుంది. ఆస్తిపాస్తులు లభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది.

మకరం

ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఈ రాశి మహిళలకు మాలవ మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల వీరు ఏ రంగంలో ఉన్న ఉన్నత స్థానానికి వెళ్లడం జరుగు తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం గానీ, విదేశాల్లో ఉద్యోగం లభించడం గానీ జరు గుతుంది. వృత్తి రంగంలో ఉన్నవారికి గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. ఒకటికి రెండు సార్లు ధన యోగాలు కలుగుతాయి. అత్యధికంగా వస్త్రాభరణాలు కొనే అవకాశం కూడా ఉంది.

(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య వివరాలు సంప్రదాయ జ్యోతిషశాస్త్ర విశ్వాసాలు, అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలుగా పరిగణించకూడదు. ఈ సమాచారాన్ని పాఠకులు తమ వ్యక్తిగత నిర్ణయాలకు ఏకైక ఆధారంగా ఉపయోగించకూడదు)